యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని వరుస ఫ్లాఫ్ లు బాధిస్తూనే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ యంగ్ టాలీవుడ్ హీరోకు సరైన హిట్ పడలేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో హిట్ ట్రాక్ ఎక్కేందుకు రామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మాస్ నుంచి బయటకు వచ్చి లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమా కోసం రామ్ స్పెషల్ ప్లాన్ వేశాడని టాక్.
పి.మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ పోతినేని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెడుతోంది. రాపో 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే ఆడిపాడుతోంది. ఈ మూవీలో కథ ప్రకారం ఓ కీ రోల్ ఉంది.
కథలో ప్రధానమైన ఈ కీ రోల్ కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రంగంలోకి దిగుతున్నాడనే టాక్ వైరల్ గా మారింది. ఇప్పుడీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
రాపో22 మూవీలో కీ రోల్ కోసం మొదట మలయాళ స్టార్ మోహన్ లాల్ ను టీమ్ సంప్రదించినట్లు టాక్. కానీ చివరకు ఉపేంద్ర ఫైనల్ అయ్యారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ కూడా ఉపేంద్రకు బాగా నచ్చిందని, అందుకే ఆయన పచ్చజెండా ఊపారని తెలిసింది. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు ఉపేంద్ర.
ఇటీవల ‘యూఐ’ అంటూ థియేటర్లలో సందడి చేశాడు ఉపేంద్ర. ఈ వర్సటైల్ యాక్టర్ కు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఇంకా చెప్పాలంటే కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గని సినిమాల్లో ఉపేంద్ర అదరగొట్టాడు.
వరుస ఫ్లాప్ ల్లో ఉన్న రామ్ కు ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అందుకే లుక్ మార్చాడు. జోనర్ మార్చాడు. లవర్ బాయ్ క్యారెక్టర్ కు రెడీ అయిపోయాడు. ఇప్పుడీ మూవీలో ఉపేంద్ర కూడా యాక్ట్ చేస్తే రామ్ కు కచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఉపేంద్రతో కలిసి రామ్ బ్లాక్ బస్టర్ కొడతాడనే అంచనాలున్నాయి. మరి నిజంగానే రామ్ సినిమాలో ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నాడా? అన్నది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.
సంబంధిత కథనం