OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ - ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్ - ఇది కన్నడ అర్జున్ రెడ్డి!
OTT Romantic Movie:కన్నడ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ ధృవతారే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతీక్, మౌల్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
OTT Romantic Movie: కన్నడ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ ధృవతారే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. సంక్రాంతి తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
హీరో కమ్ డైరెక్టర్...
ప్రతీక్ హీరోగా నటిస్తూ ధృవతారే సినిమాకు దర్శకత్వం వహించాడు. మౌల్య హీరోయిన్‌గా నటించింది. లవ్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ జంట కథతో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను మెప్పించింది. ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ నెలాఖరున ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది.
కన్నడ ఇండస్ట్రీలోకి...
ధృవతారే మూవీతోనే ప్రతీక్ డైరెక్టర్‌గా, హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో కన్నడంలో పలు సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేశాడు. ఈ సినిమాకు సూరజ్ జాయిస్ మ్యూజిక్ అందించాడు.
పరివర్తన్..అపూర్వ ప్రేమకథ...
పరివర్తన్ (ప్రతీక్) సమ్యమ (సంగీత) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. ప్రతీక్‌ను మోసం చేసి మరో అమ్మాయితో సమ్యమ పెళ్లికి సిద్ధపడుతుంది. ఆ బ్రేకప్ బాధను తట్టుకోలేకపోతాడు ప్రతీక్, తాగుబోతుగా మారిపోతాడు. అపూర్వ(మౌల్య)ది అదే కథ. బాయ్‌ఫ్రెండ్ మోసం చేయడంతో ప్రేమపైనే నమ్మకం కోల్పోతుంది. ఒంటరిగా బతుకుతుంటుంది. అలాంటి టైమ్‌లోనే సోషల్ మీడియా ద్వారా పరివర్తన్, అపూర్వ మధ్య స్నేహం మొదలవుతుంది. బ్రేకప్ బాధ నుంచి మొదలైన వారి స్నేహం ఎలా ప్రేమగా మారింది? ఇద్దరు ఒక్కటయ్యారా? లేదా అన్నదే ఈ మూవీ కథ.
సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో...
ధృవతారే మూవీలో కార్తీక్ మహేష్, అశ్విన్ రావు, మహేష్ భట్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రతీక్ హీరోగా, డైరెక్టర్‌గానే కాకుండా రైటర్, ఎడిటర్‌గా కూడా పనిచేశాడు.కన్నడంలో 1985లో రాజ్‌కుమార్ హీరోగా నటించిన ధృవతారే పెద్ద హిట్టయ్యింది. ఆ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తోనే ప్రతీక్ ఈ మూవీ చేశాడు. కాన్సెప్ట్ మేకింగ్ వైజ్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తెలుగులోని అర్జున్ రెడ్డి మూవీని గుర్తుచేస్తాయి. బోల్డ్ సీన్స్‌తో న్యూఏజ్ మూవీలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.యా