కన్నడ వెబ్ సిరీస్ అయ్యనా మానే తెలుగులోకి వచ్చేస్తోంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెలుగు వెర్షన్ మే 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఆఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో ఖుషి రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు శృతినాయుడు క్రియేటర్‌గా వ్యవహరించగా రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలో రిలీజైన ఫస్ట్ కన్నడ ఒరిజినల్ వెబ్‌సిరీస్‌గా అయ్యనా మానే నిలిచింది.
అయ్యనా మానే కన్నడంలో సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన ఐదు రోజుల్లోనే యాభై మిలియిన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. కన్నడంతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది. తాజాగా ఈ వారమే తెలుగులోకి వస్తోంది.
ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అయ్యనా మానే వెబ్ సిరీస్ ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ సిరీస్ ఓటీటీలో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ అన్నారు.
చిక్ మంగళూర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా డైరెక్టర్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఓ గొప్పింటికి చెందిన ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. ప్రతి మరణం కుల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని కుటుంబసభ్యులు నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) ఆ గొప్పింటిలోకి కోడలిగా అడుగుపెడుతుంది.
తన ప్రాణాలను ఆ శాపం బలిగొంటుందని నిజం తెలిసిన తర్వాత జాజీ ఏం చేసింది. పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మహానేష్ అండగా ఆ ఇంటి రహస్యాలను ఎలా బయటపెట్టింది? ఆ మరణాల వెనుక ఎవరున్నారు? నిజంగానే ఆ కుటుంబానికి శాపం ఉందా? అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ.
అయ్యనా మానే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటించిన ఖుషి రవి తెలుగులో ఓ సినిమా చేసింది. గత ఏడాది రిలీజైన హారర్ మూవీ పిండంలో హీరోయిన్‌గా నటించింది. కన్నడంలో కేస్ ఆఫ్ కొండన్నతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
సంబంధిత కథనం