మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?-kannada murder mystery thriller movie agnyathavasi ott release date zee5 ott to stream from 28th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనున్న ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు. 1990ల్లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే ఈ మూవీ థియేటర్లలో మంచి థ్రిల్ పంచింది.

మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి మరో కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రంగాయన రఘు లీడ్ రోల్లో నటించాడు. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

అజ్ఞాతవాసి ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడలో సప్త సాగరాలు దాటి మూవీని నిర్మించిన హేమంత్ రావ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. నిజానికి కొవిడ్ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. థియేటర్లు మూతపడటంతో రిలీజ్ వాయిదా వేశారు. మొత్తానికి ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బుధవారం (మే 28) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీలో మరింత మెరుగ్గా రాణిస్తుందని భావిస్తున్నారు. సైనైడ్ మూవీ ఫేమ్ రంగాయన రఘు లీడ్ రోల్లో ఈ సినిమా రూపొందింది. 1990ల నేపథ్యంలో ఓ హత్య చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో రఘుతోపాటు శరత్ లోహితశ్వ, అరవింద్ కుప్లికర్, పావన గౌడ, రవిశంకర్ గౌడలాంటి వాళ్లు నటించారు.

అజ్ఞాతవాసి ఎందుకు చూడాలంటే?

అజ్ఞాతవాసి మూవీ 25 ఏళ్లుగా అసలు ఎలాంటి నేరం జరగని మల్నాడ్ ప్రాంతంలోని ఓ ఊళ్లో జరిగే స్టోరీ. 1990ల నేపథ్యంలో సాగే సినిమా. అయితే స్థానిక భూస్వామి శ్రీనివాసయ్య హత్యతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడుతుంది. మొదట్లో అతనిది సహజ మరణమని భావించినా.. తర్వాత అది హత్య అని తేలుతుంది.

ఎవరు, ఎందుకు చేశారన్నదే పోలీసులు కనిపెట్టాల్సిన విషయం. ప్రతి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో ఉండే ఉత్కంఠే ఈ అజ్ఞాతవాసిలోనూ కనిపిస్తుంది. ఈ మధ్యే శాఖాహారిలాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగాయన రఘు ఈ అజ్ఞాతవాసిలోనూ అదరగొట్టాడు. అతనితోపాటు మూవీలో కీలకపాత్రలు పోషించిన వాళ్లందరి నటన చాలా బాగుంటుంది.

అజ్ఞాతవాసి మూవీలో భూస్వామి మరణం అందరికీ సహజంగానే అనిపించినా.. ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కు మాత్రం ఎందుకు హత్యలాగా కనిపించిందన్నదే ఆసక్తిరేపే ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అజ్ఞాతవాసి జీ5 ఓటీటీలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం