కన్నడ మూవీ సీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మెడికల్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
కిరణ్ సుబ్రమణి హీరోగా నటిస్తూ సీ మూవీకి దర్శకత్వం వహించాడు. శ్రీధర్ రామ్, ప్రశాంత్, రూపేష్ ఆర్య కీలక పాత్రలు పోషించారు. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.1 రేటింగ్‌ను దక్కించుకున్నది. తండ్రీ కూతుళ్ల అనుబంధం, ఆర్గాన్స్ ట్రాఫికింగ్ అనే అంశాలతో సీ మూవీ తెరకెక్కింది. గత ఏడాది ఆగస్ట్‌లో ఈ మూవీ కన్నడంలో థియేటర్లలో రిలీజైంది.
కిరణ్ సుబ్రమణి ఓ హాస్పిటల్‌లో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఓ ప్రమాదం వల్ల కూతురు కంటిచూపు కోల్పోతుంది. కళ్లకు ఆపరేషన్ చేస్తే తిరిగి చూపువస్తుందని డాక్టర్లు చెబుతారు. కంటి ఆపరేషన్ కోసం పేరున్న పెద్ద హాస్పిటల్‌లో ఆ పాపను చేరుస్తాడు కిరణ్. ఆర్గాన్స్ ట్రాఫికింగ్‌కు సంబంధించి ఓ షాకింగ్ నిజం బయటపడుతుంది? అదేమిటి? ఆ హాస్పిటల్ నుంచి తన కూతురిని తీసుకొని కిరణ్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అన్నదే ఈ మూవీ కథ.
సీ మూవీ రన్‌టైమ్ గంట నలభై ఆరు నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. కాన్సెప్ట్ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం ఈ కన్నడ మూవీ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. సీ మూవీతోనే హీరోగా, డైరెక్టర్‌గా కిరణ్ సుబ్రమణి శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ వారం సీ సినిమాతో పాటు కన్నడ మూవీ లాఫింగ్ బుద్ద ఓటీటీలోకి వచ్చింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. రిషబ్ శెట్టి నిర్మించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది. కన్నడ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ అయ్యన మనే కూడా జీ5 ఓటీటీలో శుక్రవారం రిలీజైంది.ఈ వెబ్‌సిరీస్‌లో ఖుషి రవి లీడ్ రోల్‌లో కనిపించింది. జీ 5లో రిలీజైన ఫస్ట్ కన్నడ వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం.
సంబంధిత కథనం