ఈ ఏడాది వచ్చిన కన్నడ హారర్ సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. థియేటర్లలో ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దీన్ని జనాలు తెగ చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఐఎండీబీలోలో ఏకంగా 7.7 రేటింగ్ వచ్చింది. మీరు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ కన్న సినిమా పేరు 'ఛూ మంతర్'. దీని కథంతా ఒక మిస్టీరియస్‌గా ఉండే 'మోర్గాన్ హౌస్' చుట్టూ తిరుగుతుంది. కథ మొదట ప్రేక్షకులను 1945కి తీసుకెళ్తుంది. అప్పటి నుంచే ఆ మోర్గాన్ హౌస్‌లో చీకటి కథ మొదలవుతుంది.
తర్వాత 2004లో, ఒక దెయ్యాలను పట్టుకునే వ్యక్తి ఆ మోర్గాన్ హౌస్ రహస్యం తెలుసుకోవడానికి వెళ్లి మాయమైపోతాడు. ఇక 2024లో ప్రముఖ దెయ్యాల నిపుణుడైన డైనమో అలియాస్ గౌతమ్ (శరణ్), తన టీమ్‌తో కలిసి మోర్గాన్ భవనాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు.
ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పుకోదగిన సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఈ ఛూ మంతర్ కూడా. ఇందులో హారర్‌తో పాటు కామెడీ కూడా ఉంది. భయపెట్టే సన్నివేశాలతో పాటు కామెడీ కూడా బాగా పండింది. అంతేకాదు నటీనటుల కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగా షాక్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ సినిమా హారర్ టోన్‌ను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాయి.
అయితే ఈ ఛూమంతర్ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలోని వీక్ పాయింట్లు ప్రేక్షకుల థ్రిల్ ను నీరుగార్చాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్ అంతగా ట్విస్ట్‌లు లేవు. కొన్ని సీన్లలో విజువల్ ఎఫెక్ట్స్ కాస్త తేడాగా అనిపిస్తాయి.
'ఛూ మంతర్' కన్నడ సినిమాలోని రెగ్యులర్ హారర్-కామెడీ సినిమాలకు చాలా భిన్నంగా ఉంది. ఇందులో భయం, సస్పెన్స్, కామెడీ ఒక సరైన బ్యాలెన్స్‌లో ఉంటాయి. అందుకే ప్రతి సీన్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. మీకు 'స్త్రీ' లాంటి సినిమాలు నచ్చినట్లయితే 'ఛూ మంతర్' కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం