OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ-kannada horror comedy movie forest now streaming on amazon prime video forest ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

Hari Prasad S HT Telugu

OTT Horror Comedy: ఓటీటీలోకి ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న హారర్ కామెడీ మూవీ ఒకటి వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

OTT Horror Comedy: ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్న జానర్లలో హారర్ కామెడీ కూడా ఒకటి. ఈ జానర్లో ఏ ఇండస్ట్రీ నుంచి మూవీ వచ్చినా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ కన్నడ మూవీ వచ్చింది. జనవరి 24న థియేటర్లలో రిలీజై.. ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

ఫారెస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్

హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా పేరు ఫారెస్ట్. ఈ ఏడాది జనవరి 24న వచ్చిన ఎన్నో కన్నడ సినిమాల్లో ఇదీ ఒకటి. చిక్కన్న, అనీష్ తేజేశ్వర్, గురునందన్, రంగాయన రఘు, సూరజ్ లాంటి వాళ్లు నటించిన సినిమా ఇది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 14) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించలేదు. చంద్ర మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. 80 శాతం వరకు ఓ అడవిలోనే సాగుతుంది. దీంతో ఈ మూవీకి ఫారెస్ట్ అనే పేరే పెట్టారు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో కేవలం కన్నడ ఆడియోలోనే చూసే వీలుంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా చూడొచ్చు.

ఫారెస్ట్ మూవీ స్టోరీ ఏంటంటే?

నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ ఫారెస్ట్ కూడా అలాంటిదే. ఓ అడవిలో నిధి వేట సాగించే కొందరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ అడవిని ఓ అదృశ్య శక్తి రక్షిస్తుండటంతో అది అంత సులువు కాదు. తమ పూర్వీకుల ఆస్తి కోసం సురేష, సతీష, మీనాక్షి అనే వ్యక్తులు పోట్లాడుకుంటారు. ఇది రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న మీనాక్షి తాత ఆ కోమా నుంచి బయటకు రావడానికి కారణమవుతుంది.

అతడు ఒకప్పుడు ఓ పెద్ద స్మగ్లింగ్ గ్యాంగ్ సభ్యుడు. ఆ గ్యాంగ్ లో ఇప్పుడతడు ఒక్కడే మిగిలాడు. అడవిలో ఓ చోట భారీ ఎత్తున నిధిని దాచి ఉంచినట్లు వాళ్లకు అతడు చెప్పి మరణిస్తాడు. దీంతో ఆ ముగ్గురూ ఆ నిధి వేటలో అడవిలోకి వెళ్తారు. వీళ్లతోపాటు అప్పులు ఇచ్చే కుమార అనే వ్యక్తి, చేతబడులు చేసే గోపాల కూడా వెళ్తారు. అక్కడ అడవిలో వాళ్లకు కొన్ని దెయ్యాలతో పెద్ద సవాలు వస్తుంది. మరి వాళ్ల నుంచి తప్పించుకొని వీళ్లు ఆ నిధిని చేజిక్కించుకుంటారా లేదా అన్నదే మూవీ స్టోరీ.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం