OTT Horror Comedy: హారర్ కామెడీ జానర్ ఓటీటీలో సూపర్ హిట్ ఫార్ములా. ఇప్పుడీ జానర్లోనే కన్నడ మూవీ ఛూ మంతర్ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ చూసిన సినిమా ఇది. కన్నడ నటుడు శరణ్ నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
కన్నడ హారర్ కామెడీ మూవీ ఛూ మంతర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. శుక్రవారం (మార్చి 28) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గతంలో కర్వ అనే హారర్ డ్రామా తీసిన డైరెక్టర్ నవనీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తరుణ్ శివప్ప నిర్మించిన ఈ సినిమా గతేడాదే థియేటర్లలోకి రావాల్సి ఉన్నా.. కాస్త ఆలస్యంగా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజైంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మూడు నెలల్లోనే 60 సినిమాలు రిలీజైనా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సంక్రాంతికి వచ్చిన ఈ ఛూ మంతర్ మూవీయే కాస్త సక్సెస్ సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సుమారు 50 రోజుల పాటు థియేటర్లలో నడిచిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. కేవలం కన్నడ ఆడియోలోనే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఈ సినిమా రానుంది.
ఈ ఛూ మంతర్ మూవీలో శరణ్ తోపాటు ప్రభుదేవా, చిక్కన్న, ప్రభు ముండ్కర్, మేఘనా గవోన్కర్, రజనీ భరద్వాజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో శరణ్ డ్యుయల్ రోల్లో నటించాడు. రెండు టైమ్ పీరియడ్స్ లో అతడు ఇద్దరు అతీత శక్తుల పని పట్టే నిపుణుడి పాత్రల్లో కనిపించాడు.
డైనమో అనేది ఒక పాత్ర. ఇదో భూత వైద్యుడి పాత్ర. మోర్గాన్ హౌస్ అనే ఓ మ్యాన్షన్ లో జరుగుతున్న అతీత శక్తుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ పాత్ర ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో అతడు విఫలం కాగా.. అతని కొడుకు గౌతమ్ కూడా అదే పనిలో ఉంటాడు. ఆ ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లుగా అతడు నమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడాలి.
సంబంధిత కథనం