నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకు నా వాయిస్.. హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కామెంట్స్.. కన్నడ అమ్మాయిలా కాకుండా అంటూ!-kannada heroine srinidhi shetty about her telugu dubbing to nani hit 3 movie says my voice to my first telugu movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకు నా వాయిస్.. హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కామెంట్స్.. కన్నడ అమ్మాయిలా కాకుండా అంటూ!

నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకు నా వాయిస్.. హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కామెంట్స్.. కన్నడ అమ్మాయిలా కాకుండా అంటూ!

Sanjiv Kumar HT Telugu

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమా హిట్ ది థర్డ్ కేస్. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విలేకరుల సమావేశంలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకు నా వాయిస్.. హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కామెంట్స్.. కన్నడ అమ్మాయిలా కాకుండా అంటూ!

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ హిట్ 3 (హిట్ ది థర్డ్ కేస్). ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 మూవీని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.

మే 1న పాన్ ఇండియాగా

హిట్ 3 టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక హిట్ ది థర్డ్ కేస్ మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది?

-ఇందులో మృదుల అనే పాత్రలో కనిపిస్తాను. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు టీజర్ ట్రైలర్‌లో ఆల్రెడీ చూశారు. ఇంటెన్స్ వయోలెన్స్‌స్‌తో కూడిన క్యారెక్టర్ అది. వయోలెన్స్‌తో పాటు ఆ క్యారెక్టర్‌లో చాలా యాంగిల్స్ ఉంటాయి. అర్జున్ సర్కార్‌కి డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్ మృదుల.

-అర్జున్ సర్కార్, మృదుల మాట తప్పితే ఇంకెవరి మాట కేర్ చేయరు. మృదుల ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో కొన్ని లేయర్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. మీరు సినిమా చూస్తున్నప్పుడే పూర్తిగా తెలుసుకోవాలి.

ఈ కథలో మీ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?

-నిజానికి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ, డైరెక్టర్ శైలేష్ కొలను బ్రిలియంట్ రైటర్. మీరు హిట్, హిట్ 2 సినిమాలు గమనిస్తే ఒక్కొక్క సినిమాకి హీరోయిన్ క్యారెక్టర్జేషన్‌లో చాలా ఇంపార్టెన్స్ పెరిగి ఉంటుంది. కథలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లెండ్ అయి ఉంటుంది.

-హిట్ 3లో కూడా హీరోయిన్ క్యారెక్టర్‌ని ఇంకా బెటర్ చేశారు. కథలో చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. కథలో ఎంత ఇంపార్టెంట్ ఉందో సినిమా చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది.

ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పారని విన్నాం?

-అవును. చాలా ఇష్టంగా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆల్రెడీ నా క్యారెక్టర్ కోసం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. అయితే డైరెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చేస్తానని అడిగాను. డబ్బింగ్ చెప్పాను. నా వాయిస్ డైరెక్టర్ గారికి నచ్చింది.

-నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నా వాయిస్ ఉండడం చాలా ఆనందంగా అనిపించింది. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాను.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం