Payal Radhakrishna About Chaurya Paatam Telugu Dubbing: కన్నడలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ పాయల్ రాధాకృష్ణ తెలుగులో కూడా కథానాయికగా అలరిస్తోంది. తరగది గది దాటి ఓటీటీ వెబ్ సిరీస్, ప్రసన్నవదనం సినిమాలో హీరోయిన్‌గా చేసింది పాయల్ రాధాకృష్ణ.
ఇప్పుడు కన్నడ బ్యూటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ చౌర్య పాఠం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన డార్క్ క్రైమ్ కామెడీ మూవీ చౌర్య పాఠం సినిమాతో ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అలాగే, కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న చౌర్య పాఠం మూవీకి చూడమణి సహ నిర్మాతగా ఉన్నారు. ఇదివరకు రిలీజ్ అయిన చౌర్య పాఠం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్‌తో బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించింది. సమ్మర్‌లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా చౌర్య పాఠం నిలవనుందని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారతు.
ఇక ఏప్రిల్ 25న థియేటర్లలో చౌర్య పాఠం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఏప్రిల్ 16న చౌర్య పాఠం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నడ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 25న చౌర్య పాఠం వస్తుంది. మీరందరూ సపోర్ట్ చేసి పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ నేనే చేశాను. మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 25న థియేటర్స్‌లో కలుద్దాం" అని చెప్పింది.
కాగా, ఇదే ఈవెంట్‌లో హీరోగా పరిచయం అవుతోన్న ఇంద్రరామ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కంటెంట్ చాలా బాగుంది. త్రినాథ్ గారు ధమాకాతో రూ. 100 కోట్లు సినిమా కొట్టారు. ఆయన అనుకుంటే చాలా పెద్ద స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా చేయొచ్చు. ఆయన కొత్తవారికి ఛాన్స్ ఇద్దామని నాకు నిఖిల్‌కి, పాయల్‌కి దాదాపు ఇందులో ఉన్న అందరికీ అవకాశం ఇచ్చారు" అని అన్నాడు.
"ఈ సినిమాకి సంబంధించి ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తవారికి ఛాన్స్ ఇస్తేనే కొత్త ప్రతిభ బయటకు వస్తుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆడియన్స్ ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని ఇంద్రరామ్ తెలిపాడు.
సంబంధిత కథనం