Martin Teaser Released: మార్టిన్ టీజర్ వచ్చేసింది.. పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ హీరో చిత్రం
Martin Teaser Released: కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా నటించిన సరికొత్త చిత్రం మార్టిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ను చూస్తేనే తెలుస్తోంది.
Martin Teaser Released: కన్నడ హీరో ధ్రువ్ సర్జా పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన నటుడు. ఈ సినిమాలోని ఖరాబు సాంగ్ అప్పట్లో సూపర్ హిట్టయింది. ప్రస్తుతం ఈ స్టార్ నటించిన తాజా చిత్రం మార్టిన్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. మార్టిన్ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. పుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ టీజర్‌ను గమనిస్తే ధ్రువ్ సర్జా తన రూపాన్ని మార్చాడు. పొగరు సినిమాలో గుబురు గడ్డంతో కనిపించిన ఈ హీరో.. ఇందులో మాత్రం క్లీన్ షేవ్‌తో కనిపించినప్పటికీ అదే రగెడ్, మాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో తనదైన యాక్షన్ సీన్లతో అలరించాడు. టీజర్‌ను చూస్తే ఈ సినిమా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. హీరో పాకిస్థాన్ జైలుకు వెళ్లడం, అక్కడ కొన్ని గ్రూపులతో అబ్బుర పరిచే పోరాటాలు చేయడం లాంటివి ఈ టీజర్‌లో గమనించవచ్చు.
విజువల్స్, టేకింగ్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. యూ థింక్ యువర్ స్ట్రాంగ్.. అండ్ ఐ నో ఐయామ్ స్ట్రాంగ్ అంటూ హీరో చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాలో ధ్రువ్ సరసన వైభవి శాండిల్య హీరోయిన్‌గా చేస్తోంది. వీరితో పాటు అన్వేషి జైన్, చిక్కన్న, మాలవిక అవినాశ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏపీ అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఉదయ్ కే మెహతా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అర్జున్ సర్జా ఈ చిత్రానికి కథను అందించారు కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన రవి బస్రూర్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందీ చిత్రం.