Kannada Directors Tollywood Movies: టాలీవుడ్ హీరోల వెంటపడుతోన్న కన్నడ దర్శకులు - తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది వీళ్లే-
Kannada Directors Tollywood Movies: ఈ ఏడాది కొందరు కన్నడ దర్శకులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు హీరోలతో సినిమాలు చేస్తోన్న ఆ దర్శకులు ఎవరంటే
Kannada Directors Tollywood Entry: పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు సినిమా వెలిగిపోతోంది. టాలీవుడ్ సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబడుతూ రికార్డులను కొల్లగొడుతోన్నాయి. ఈ సక్సెస్‌ల నేపథ్యంలో టాలీవుడ్‌లో పాగా వేసేందుకు బాలీవుడ్ నుంచి సాండల్‌వుడ్ వరకు అన్ని భాషలకు చెందిన దర్శకులు రెడీ అవుతోన్నారు. టాలీవుడ్ స్టార్స్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ ఏడాది కొందరు కన్నడ దర్శకులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు హీరోలతో సినిమాలు చేస్తోన్న ఆ దర్శకులు ఎవరంటే…
ట్రెండింగ్ వార్తలు
సలార్ తో ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ అద్భుత విజయం తర్వాత ప్రశాంత్ నీల్‌లో సినిమా చేసేందుకు ఇండియన్ టాప్ స్టార్స్ క్యూ కడుతోన్నారు. కానీ అతడు మాత్రం టాలీవుడ్ హీరోల వైపు మొగ్గుచూపుతోన్నారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తోన్నాడు ప్రశాంత్ నీల్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సలార్ తర్వాత ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా కమిటయ్యాడు. ప్రశాంత్ నీల్ శైలి యాక్షన్ అంశాలతో ఈ సినిమా రూపొందనుంది.
ఎన్టీఆర్ బాటలోనే గోపీచంద్…
ఎన్టీఆర్ బాటలోనే మరో టాలీవుడ్ హీరో గోపీచంద్ కూడా తన 31వ సినిమా కోసం కన్నడ దర్శకుడినే నమ్ముకున్నాడు. కన్నడంలో వేదతో పాటు పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన హర్షతో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే గోపీచంద్, హర్ష సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు సమాచారం.
కన్నడ దర్శకుడితో చరణ్…
ఆర్ఆర్ఆర్ తో అసమాన విజయాన్ని అందుకున్న మెగా హీరో రామ్‌చరణ్‌తో కన్నడ దర్శకుడు నార్తన్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్షన్ కథాంశంతో నార్తన్ సిద్ధం చేసిన కథ నచ్చడంతో చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చరణ్ బర్త్‌డే రోజున ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కబ్జ దర్శకుడు చంద్రు... పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్‌ను చంద్రు కలిశాడు. అప్పటినుంచే ఈ ప్రచారం మొదలైంది. వీరితో పాటు మరికొందరు కన్నడ దర్శకులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నారు.