Comedy Drama OTT: తెలుగులోకి వ‌స్తోన్న క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?-kannada comedy drama movie kousalya supraja rama telugu version to stream on etv win ott from febuary 27th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Comedy Drama Ott: తెలుగులోకి వ‌స్తోన్న క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Comedy Drama OTT: తెలుగులోకి వ‌స్తోన్న క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 01, 2025 02:15 PM IST

Comedy Drama OTT: క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ కౌస‌ల్య సుప్ర‌జ రామ తెలుగులోకి వ‌స్తోంది. డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 27 న రిలీజ్ కాబోతోంది. ఈ కామెడీ డ్రామా మూవీలో డార్లింగ్ కృష్ణ‌, బృంద ఆచార్య‌, మిలానా నాగ‌రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

కామెడీ డ్రామా ఓటీటీ
కామెడీ డ్రామా ఓటీటీ

Comedy Drama OTT: క‌న్న‌డంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన కామెడీ డ్రామా మూవీ కౌస‌ల్య సుప్ర‌జ రామ‌ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సేమ్ టైటిల్‌తో ఈ మూవీ తెలుగులో విడుద‌ల అవుతోంది.

15 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

కౌస‌ల్య సుప్ర‌జ రామ‌ మూవీలో డార్లింగ్ కృష్ణ‌, బృంద ఆచార్య‌, మిలానా నాగ‌రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. 2023లో క‌న్న‌డంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ 15 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా నిలిచింది. నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల‌కుపైగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. శ‌శాంక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

ఆర‌వ మూవీ...

డార్లింగ్ కృష్ణ‌, మిలానా నాగ‌రాజ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆర‌వ మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ల‌వ్ మాక్ టెయిల్‌, ల‌వ్ మాక్ టెయిల్ 2, ల‌వ్ బ‌ర్డ్స్‌, మిస్ట‌ర్ బ్యాచ్‌ల‌ర్‌తో పాటు మ‌రో సినిమా చేశారు. రియ‌ల్‌లైఫ్‌లో వీరిద్ద‌రు భార్యాభ‌ర్త‌లు కావ‌డం గ‌మ‌నార్హం. రంగాయ‌న ర‌ఘు, సుధా బెల్వాడి, అచ్యూత్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ...

మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు శ‌శాంక్ కౌస‌ల్య సుప్ర‌జ రామ మూవీని రూపొందించాడు. కాన్సెప్ట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు డార్లింగ్ కృష్ణ యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

రామ్ ప్రేమ‌క‌థ‌...

సిద్ద‌గౌడ (రంగాయ‌న ర‌ఘు) పురుషాదిక్య భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తి. ఆడ‌వాళ్లు ఇంటికే ప‌రిమితం కావాల‌నే, భ‌ర్త‌ల‌కు సేవ చేయ‌డమే వారి ప‌ని న‌మ్ముతాడు. భార్య కౌస‌ల్య‌పై (సుధ‌) పెత్త‌నం చెలాయిస్తుంటాడు. సిద్ద‌గౌడ కొడుకు రామ్ (డార్లింగ్ కృష్ణ‌) కూడా తండ్రి సిద్ధాంతాల‌నే ఫాలో అవుతుంటాడు. రామ్ జీవితంలోకి అనుకోకుండా శివానీ (భృందా ఆచార్య‌) ఎంట్రీ ఇస్తుంది.

ఆమెను రామ్ ప్రాణంగా ప్రేమిస్తాడు. శివానీ ల‌వ్‌కు బ్రేక‌ప్ చెప్పి అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. ఆబ్రేక‌ప్ బాధ‌లో ఉండ‌గానే రామ్‌కు ముత్తుల‌క్ష్మితో (మిలానా నాగ‌రాజ్‌) పెళ్ల‌వుతుంది. రామ్‌లో ఎలా మార్పు వ‌చ్చింది. శివాజీ అత‌డికి దూరం కావ‌డానికి కార‌ణ‌మేమిటి? ఆడ‌వాళ్ల గొప్ప‌త‌నాన్ని రామ్ ఎలా అర్థం చేసుకున్నాడు? భ‌ర్త మంచి మ‌న‌సును ముత్తుల‌క్ష్మి అర్థం చేసుకుందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అర్జున్ జ‌న్యా మ్యూజిక్‌...

కౌస‌ల్య సుప్ర‌జ రామ మూవీకి అర్జున్ జ‌న్యా మ్యూజిక్ అందించాడు. డార్లింగ్ కృష్ణ క‌న్న‌డంలో ల‌వ్ మీ ఆర్ హేట్ మీ, ఫాద‌ర్‌తో పాటు మ‌రో సినిమా చేస్తోన్నాడు.

Whats_app_banner