Ranya Rao Arrest: 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో డీజీపీ కూతురు అరెస్ట్.. హీరోయిన్ రన్య రావుకు 14 రోజుల రిమాండ్!-kannada actress ranya rao arrested for smuggling 14 above kg gold at bangalore airport and sent to 14 days remand ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranya Rao Arrest: 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో డీజీపీ కూతురు అరెస్ట్.. హీరోయిన్ రన్య రావుకు 14 రోజుల రిమాండ్!

Ranya Rao Arrest: 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో డీజీపీ కూతురు అరెస్ట్.. హీరోయిన్ రన్య రావుకు 14 రోజుల రిమాండ్!

Sanjiv Kumar HT Telugu

Kannada Actress Ranya Rao Arrest At Airport: కన్నడ హీరోయిన్ రన్య రావు అరెస్ట్ అయింది. బెంగళూరు విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో రన్య రావు పట్టుబడింది. ఆదాయపు పన్ను విభాగం అధికారులు రన్య రావును అరెస్ట్ చేసినట్లు పీటీఐ సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో డీజీపీ కూతురు అరెస్ట్.. హీరోయిన్ రన్య రావుకు 14 రోజుల రిమాండ్! (Facebook/ Ranya Rao)

Kannada Actress Ranya Rao Arrest At Airport: సోమవారం (మార్చి 3) రాత్రి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ హీరోయిన్ రన్య రావు అరెస్ట్ అయింది. ఆదాయపు పన్ను విభాగం (డీఆర్ఐ) అధికారులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదికలో పేర్కొంది.

14 రోజుల పాటు రిమాండ్

అరెస్ట్ అనంతరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కోర్టులో రన్య రావును హాజరుపరిచారు. దాంతో రన్య రావుకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దాంతో రన్య రావును జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

15 రోజుల్లో నాలుగు సార్లు

అయితే, రన్య రావు 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఒంటరిగా చేసిందా లేదా దుబాయ్, భారతదేశం మధ్య పనిచేస్తున్న ఏదైనా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగంగా చేస్తుందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రన్య రావు 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కి వెళ్లింది. దీంతో ఆమెను పోలీసులు అనుమానించారు.

2014లో హీరోయిన్‌గా ఎంట్రీ

రన్య రావుపై వచ్చిన అనుమానంతో సోమవారం ఆపరేషన్ నిర్వహించి ఆమెను పట్టుకున్నారు. దాంతో 14.8 కేజీల బంగారం బండారం బయపడింది. ఇదిలా ఉంటే, కాగా కన్నడ ఇండస్ట్రీలోని పలు సినిమాల్లో రన్య రావు హీరోయిన్‌గా నటించింది.

మిర్చి మూవీ రీమేక్

2014లో స్టార్ కిచ్చా సుదీప్ నటించిన మాణిక్య సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది రన్య రావు. ప్రభాస్ మిర్చి సినిమాకు మాణిక్య రీమెక్‌గా కన్నడలో తెరకెక్కింది.

ఐపీఎస్ అధికారికి స్టెప్ డాటర్

ఈ మాణిక్య సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తోపాటు మరో హీరోయిన్‌గా రన్య రావు యాక్ట్ చేసింది. అలాగే, మరికొన్ని సౌత్ సినిమాల్లో నటించి అలరించింది రన్య రావు. 33 ఏళ్ల రన్య రావు కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్ర రావు స్టెప్ డాటర్. ఆయన కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా పనిచేస్తున్నారు.

మరో రెండు సినిమాల్లో

ఇక మాణిక్య సినిమాలో మానసగా నటించిన రన్య రావు అనంతరం వాఘహ్, పాటకి వంటి సినిమాల్లో నటించింది. తమిళ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వాఘహ్‌లో విక్రమ్ ప్రభు హీరోగా, రన్య రావు హీరోయిన్‌గా చేసింది. తులసి, అజయ్ రత్నం కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2016లో విడుదల అయింది.

యాక్షన్ కామెడీ చిత్రంగా

ఇక ఈ సినిమా తర్వాత 2017లో పాటకి మూవీతో అలరించింది రన్య రావు. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన పాటకి మూవీలో గణేష్ హీరోగా నటించాడు. సంగీత అనే పాత్రలో హీరోయిన్‌గా చేసింది రన్య రావు. అంతేకాకుండా ఈ మూవీలో సాయి కుమార్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.