OTT Action Thriller: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్.. 72 గంటల్లోనే..-kannada action thriller movie max 100 million streaming minutes on zee5 ott in just 72 hours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్.. 72 గంటల్లోనే..

OTT Action Thriller: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్.. 72 గంటల్లోనే..

Hari Prasad S HT Telugu
Published Feb 18, 2025 02:05 PM IST

OTT Action Thriller: ఓటీటీలో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ దుమ్ము రేపుతోంది. రికార్డులు తిరగరాస్తూ 72 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకోవడం విశేషం.

ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్
ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్

OTT Action Thriller: ఓటీటీలోకి మూడు రోజుల కిందట వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ (Max). కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. 72 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది.

ఓటీటీలో మ్యాక్స్ ర్యాంపేజ్

కిచ్చా సుదీప్ మాస్ అవతారంలో కన్నడ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మూవీ మ్యాక్స్. ఈ సినిమా గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 50 రోజుల తర్వాత ఫిబ్రవరి 15 నుంచి జీ5 ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే రోజు జీ కన్నడలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా రావడం విశేషం.

అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. కన్నడ వెర్షన్ తోపాటు తెలుగు వెర్షన్ కూడా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 72 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్నట్లు జీ5 తెలుగు ఓటీటీ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“100 మిలియన్ మ్యాక్స్ మినట్స్.. ఈ బ్లాక్‌బస్టర్ తో మాస్ కు సరికొత్త నిర్వచనం ఇస్తోంది. జీ5లో మ్యాక్స్ ఈరోజే చూడండి” అనే క్యాప్షన్ తోపాటు ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. అందులో మూవీ 72 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్నట్లు వెల్లడించారు.

మ్యాక్స్ మూవీ ఎలా ఉందంటే?

విజ‌య్ కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మ్యాక్స్ మూవీ క్రిస్మ‌స్ కానుక‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మ్యాక్స్ మూవీ క‌థ మొత్తం ఒక్క రాత్రిలోనే ఓ పోలీస్ స్టేష‌న్ నేప‌థ్యంలోనే సాగుతుంది. క‌థ ప‌రంగా చూసుకుంటే సింపుల్ పాయింట్‌. సుదీప్‌కు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న యాక్ష‌న్‌ ఇమేజ్‌ను వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌ల‌తో ద‌ర్శ‌కుడు మ్యాజిక్ చేశాడు.

మ్యాక్స్ మూవీతో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్ట‌ర్ విజ‌య్ కార్తికేయ‌. కొన్ని చోట్ల మాక్స్ మూవీ కార్తి ఖైదీని త‌ల‌పిస్తుంది. ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని ద‌ర్శ‌కుడు మాక్స్ క‌థ‌ను రాసుకున్నాడు. ఫ‌స్ట్ హాఫ్ త‌ర్వాతే క్లైమాక్స్ ఏమిట‌న్న‌ది అర్థ‌మైపోతుంది. హీరోకు ధీటైన విల‌న్ పాత్ర సినిమాలో క‌నిపించ‌దు.

అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. వసూళ్లు కూడా ఇంచుమించు రూ.60 కోట్ల వరకూ ఉన్నాయి. ఇప్పుడీ మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం