కన్నడ మూవీ మార్టిన్ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మార్టిన్ మూవీలో ధృవ్ సర్జా హీరోగా నటించాడు. వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించాడు.
మార్టిన్ మూవీకి సీనియర్ హీరో అర్జున్ కథను అందించాడు. గత ఏడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కన్నడంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ 27 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. కన్నడంలో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది.
కథే లేకుండా యాక్షన్ అంశాలతో ప్రేక్షకులను మెప్పించాలనే దర్శకనిర్మాతల ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. కేజీఎఫ్‌తో పాటు గతంలో దక్షిణాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన పలు యాక్షన్ సినిమాల స్ఫూర్తితో మేకర్స్ ఈ మూవీని రూపొందించారు.
అర్జున్ కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళతాడు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడన్నది తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ అర్జున్ కలిసిన వాళ్లందరూ అతడి కళ్ల ముందే హత్యకు గురవుతుంటారు. అసలు అర్జున్ ఎవరు? ఇండియాలో ఉన్న తన ప్రియురాలు ప్రీతిని అర్జున్ కలిశాడా? అర్జున్ పోలికలతోనే ఉన్న మార్టిన్ ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
మార్టిన్ మూవీకి రవి బస్రూర్, మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా షూటింగ్‌ను 250 రోజులు జరిపారు. కన్నడంలో అత్యధిక రోజులు షూటింగ్‌ను జరుపుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను దాదాపు 52 రోజుల పాటు షూట్ చేశారు.
కన్నడంలో మార్టిన్ కంటే ముందు పొగరు, బర్జారీ, బహద్దూర్, అద్దూరీతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు ధృవ్ సర్జా.
టాపిక్