Kangana Slams Karan: ప్రియాంక చోప్రాను కరణ్ వేధించాడు.. ఇండియా నుంచి తరిమికొట్టాడు.. కంగనా ఫైర్-kangana says everyone knows karan johar had banned priyanka that s why she leaved india
Telugu News  /  Entertainment  /  Kangana Says Everyone Knows Karan Johar Had Banned Priyanka That's Why She Leaved India
ప్రియాంక చోప్రా-కంగనా రనౌత్
ప్రియాంక చోప్రా-కంగనా రనౌత్

Kangana Slams Karan: ప్రియాంక చోప్రాను కరణ్ వేధించాడు.. ఇండియా నుంచి తరిమికొట్టాడు.. కంగనా ఫైర్

29 March 2023, 7:14 ISTMaragani Govardhan
29 March 2023, 7:14 IST

Kangana Slams Karan: ప్రియాంక చోప్రా భారత్‌ను విడిచిపెట్టడానికి కారణం కరణ్ జోహారే అని అతడిపై కంగనా రనౌత్ ఫైర్ అయింది. కరణ్.. ప్రియాంకను కార్నర్ చేసి వేధించాడని, మూవీ మాఫియా ఆమెను బ్యాన్ చేసిందని పేర్కొంది.

Kangana Slams Karan: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బీటౌన్ పాలిటిక్స్‌పై స్పందించింది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ నెపో కిడ్స్‌పైన, ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులపై విమర్శలు గుప్పించె కంగనా.. తాజాగా మరోసారి విరుచుకుపడింది. తను బాలీవుడ్ వదిలేయడానికి అక్కడ పాలిటిక్సే అంటూ ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో.. ఆ విషయంపై ఫైర్ బ్రాండ్ స్పందించింది. ప్రియాంక పరిస్థితికి కారణం కరణ్ జోహార్ అంటూ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేసింది. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక స్నేహం కారణంగానే ఆమెను బాలీవుడ్ బ్యాన్ చేసిందని పేర్కొంది.

"బాలీవుడ్ గురించి ప్రియాంక చెప్పింది ఇదే. కొంతమంది మంది ఆమెకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ కట్టారు. ఆమెను బెదిరించారు. చిత్రసీమ నుంచి వెళ్లగొట్టారు. స్వయంకృషితో ఎదిగిన ఆ మహిళ భారత్‌ను వదిలేలా చేశారు. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశాడనేది అందరికీ తెలుసు" అని కంగనా తన ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది.

కంగనా మరో ట్వీట్ చేస్తూ.. షారుఖ్‌తో స్నేహం కారణంగానే మూవీ మాఫియా, కరణ్ జోహార్‌ విభేదించారని మీడియా విస్తృతంగా రాసింది. అవుట్ సైడర్ అయిన ప్రియాంక చోప్రాను వేధించడంలో ఈ గ్రూప్ మునిగిపోయింది. చివరకు ఆమె ఇండియాను విడిచిపెట్టాల్సి వచ్చింది. అమితాబ్ లేదా షారుఖ్ కాలంలో బయట వ్యక్తులతో ఎలాంటి శతృత్వం లేదు. అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ కల్చర్‌ను నాశనం చేసినందుకు ఈ నీచమైన, విషపూరితమైన వ్యక్తే(కరణ్) బాధ్యత వహించాలి. అతడి గ్యాంగ్, మాఫియా పీఆర్.. బయట వ్యక్తులపై చేసిన దాడికి, వేధింపులకు బాధ్యత వహించాలి." అని కంగనా స్పష్టం చేసింది.

ఇటీవలే ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఈ విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌లో తనను నిషేధించారని, తనకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ ఏర్పడి ఇబ్బంది పెట్టిందని పేర్కొంది. "బాలీవుడ్‌లో నేను కార్నర్ అయ్యాను. నన్ను ఎవరూ క్యాస్టింగ్ చేయలేదు. కొందరు వ్యక్తులతో తలెత్తిన విభేదాల కారణంగా పాలిటిక్స్‌ ఎదుర్కొన్నాను. వాటితో విసిగిపోయిన నేను బాలీవుడ్ నుంచి పెద్ద బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. ఇలాంటి సమయంలో నా మేనేజర్ అంజులా ఆచారియా వెస్టర్న్ మ్యూజిక్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమనడంతో వేరే ప్రపంచంలోకి వచ్చాను" అని ప్రియాంక తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రియాంక పిట్‌బుల్, కొన్ని ఇతర మ్యూజిక్ వీడియోలను రూపొందించింది. వీటి ద్వారా క్వాంటికో అనే టీవీ సిరీస్‌లో అవకాశం దక్కించుకుని బేవాచ్ లాంటి సినిమాల్లో నటించింది. క్వంటికోలో తన పాత్రకు గాను వరుసగా రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం రూసో బ్రదర్స్‌తో సిటడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ ఇటీవలే విడుదలైంది. ఇది కాకుండా హిందీలో జీలే జరా అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. హాలీవుడ్‌లో లవ్ ఎగైన్ అనే మరో చిత్రంలో కనిపించనుంది.

Kangana Ranaut has come out in support of Priyanka Chopra on Twitter.
Kangana Ranaut has come out in support of Priyanka Chopra on Twitter.