Kangana Ranaut : ఇలాంటి పొట్టి బట్టలేసుకుంటావా? యువతికి కంగనా క్లాస్-kangana ranaut fires on girl who is wearing short dress inside the temple
Telugu News  /  Entertainment  /  Kangana Ranaut Fires On Girl Who Is Wearing Short Dress Inside The Temple
కంగనా రనౌత్
కంగనా రనౌత్

Kangana Ranaut : ఇలాంటి పొట్టి బట్టలేసుకుంటావా? యువతికి కంగనా క్లాస్

26 May 2023, 13:04 ISTAnand Sai
26 May 2023, 13:04 IST

Kangana Ranaut On Girl Dress : నటి కంగనా రనౌత్ సినిమాలతోనే కాదు.. అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఓ యువతి దుస్తులపై కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె మాటలు వైరల్ అయ్యాయి.

నటి కంగనా రనౌత్(Kangana Ranaut)కు సినిమాలే కాదు.. ఇతర విషయాలపైనా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. తరచూ ఏదో ఓ విషయంతో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు ఓ యువతి దుస్తులపై వ్యాఖ్యలు చేసింది. గుడికి వచ్చే సమయంలో సరైన దుస్తులు ధరించి రావాలని కంగనా సూచించింది. ఆమె అభిప్రాయంపై నెటిజన్లలో అనుకూల వ్యతిరేక చర్చ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్‌నాథ్ ఆలయానికి వచ్చిన ఓ యువతి పొట్టి దుస్తులు ధరించింది. ఆ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో ఎవరో షేర్ చేశారు.

ఈ విషయాన్ని గమనించిన కంగనా ఫైర్ అయింది. ఆ యువతికి ట్విట్టర్లోనే క్లాస్ తీసుకుంది. ఈ డ్రెస్ వేసుకున్న వారు.. ఇవి మామూలు బట్టలు అనుకుంటారని తెలిపింది. అది అటువంటి వారు సోమరితనం తప్ప మరొకటి కాదని విమర్శించింది. వారికి అది తప్ప వేరే ఉద్దేశం లేదని నేను అనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి మూర్ఖులకు కఠిన నిబంధనలు ఉండాలని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.

'ఇవన్నీ పాశ్చాత్యులు తయారుచేసిన మరియు ప్రచారం చేసిన బట్టలు. ఒకసారి వాటికన్ వెళ్లాను. షార్ట్, టీ షర్ట్ వేసుకుని ఉండడంతో నన్ను లోపలికి అనుమతించలేదు. నేను తిరిగి హోటల్‌కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.' అని కంగనా రనౌత్ ట్వీట్(Kangana Ranaut Tweet) చేసింది. కంగనా మాటలతో కొందరు ఏకీభవించారు. అయితే మరికొందరు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేశారు. 'ఇది కరెక్ట్ కాదు. మీరు సినిమాల్లో అలాంటి దుస్తులను ప్రమోట్ చేస్తారు. మీరు వేసుకుంటే తప్పు కాదు, ఇతరులు వేసుకుంటే తప్పా? మీపై ఎవరైనా కామెంట్స్ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కదా' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. 'ఇప్పుడు ఫెమినిస్టులంతా వచ్చి వెళ్లిపోతారు..' అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, కంగనా రనౌత్ తదితరులు కేదార్‌నాథ్ ఆలయాన్ని(Kedarnath Temple) సందర్శించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కంగనా. ఆలయ సందర్శన సమయంలో కంగనా సాంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించి ఉంది. నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో అని క్యాప్షన్ ఇచ్చింది.

ఎమర్జెన్సీ చిత్రంతో(Emergency Movie) కంగనా బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చింది. విశేషమేమిటంటే ఇటీవల విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ చిత్రాన్ని వీక్షించారు. ఆయనకు ఈ సినిమా నచ్చింది. అంతే కాదు చాలా సీన్లు చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తాజాగా కంగనా రనౌత్ స్వయంగా వెల్లడించింది.

టాపిక్