Kamal Haasan: 67 ఏళ్ల వయసులో 26 పుషప్స్ చేసిన కమల్.. వీడియో వైరల్
Kamal Haasan: వయసు మీద పడినా.. ఫిట్‌నెస్‌లో మాత్రం కమల్ హాసన్ ఏమాత్రం తగ్గలేదు. 67 ఏళ్ల వయసులోనూ అతడు పుషప్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కమల్ హాసన్ 70ల్లోకి చేరడానికి దగ్గరవుతున్నాడు. కానీ అతని ఫిట్‌నెస్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ మధ్యే రిలీజైన విక్రమ్ మూవీలోనూ అతడు కొన్ని ఫైట్ సీన్స్‌ను ఎంతో సులువుగా చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. ఆ మూవీలో యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. ఇక కమల్ ఫిట్‌నెస్‌కు అద్దం పట్టే మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను విక్రమ్ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో కమల్ పుషప్స్ చేయడం మనం చూడొచ్చు. ఇది విక్రమ్ మూవీ షూటింగ్ సమయంలోని వీడియో. ఇందులో కమల్ ఆగకుండా 26 పుషప్స్ చేయడం విశేషం. 67 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్నాడేంటి అంటూ ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ముందుగా చెప్పినట్లే కమల్‌హాసన్ సర్ వీడియో పోస్ట్ చేస్తున్నాను.. అతడు 26 పుషప్స్ చేశాడు. నేను మొదట్లో చేసిన రెండు మిస్సయ్యాను అని ఈ వీడియో పోస్ట్ చేస్తూ లోకేష్ కనకరాజ్ కామెంట్ చేశాడు. కమల్ పుషప్స్ చేస్తుండగా.. అతనికి తెలియకుండా దూరం నుంచి తీసిన వీడియోలాగా ఇది కనిపిస్తోంది. నిజానికి సోమవారమే దీనికి సంబంధించిన ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసిన అతడు.. పూర్తి వీడియో రేపు చూడండి అంటూ కామెంట్ చేశాడు.
అతడు నిజంగా 67 ఏళ్లు ఉన్నాడా.. ఎంతోమంది యువ హీరోల కంటే ఫిట్‌గా ఉన్నాడంటూ ఎంతో మంది యూజర్లు అన్నారు. అతనికి సిక్స్ ప్యాక్ అవసరం లేదు కానీ.. ఇండియాలో ఫిట్టెస్ట్ యాక్టర్ అతడే అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. విక్రమ్ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్