భారీ అంచనాలు.. కానీ మరోవైపు వివాదాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే బాగానే కలెక్షన్లు రాబట్టింది. 1987లో వచ్చిన నాయకన్ మూవీ తర్వాత డైరెక్టర్ మణిరత్నం, దిగ్గజ యాక్టర్ కమల్ హాసన్ కాంబోలో ఈ మూవీ రావడంతో క్రేజీ బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చింది ఈ మూవీ. గురువారం (జూన్ 5) రిలీజైంది థగ్ లైఫ్. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఉన్నాయి.
కమల్ హాసన్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్ ఫస్ట్ డే ఇండియాలో రూ.17 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో గురువారం రిలీజైంది ఈ మూవీ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు.
థగ్ లైఫ్ గురువారం 52.06% తమిళ ఆక్యుపెన్సీని కలిగి ఉంది. మార్నింగ్ షోలకు 50.66 శాతం, మధ్యాహ్నం షోలకు 50.35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం షోలకు ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 45.15 శాతంగా నమోదైంది. నైట్ షోలకు 62.07 శాతం ఆక్యుపెన్సీ ఉంది.
ఐకానిక్ నాయకన్ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ థగ్ లైఫ్ వివాదాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. కమల్ హాసన్ నటించిన సినిమా కన్నడ భాషా వివాదం కారణంగా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. దీంతో మూవీ రూ.35-40 కోట్లు నష్టపోయింది. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కమల్ 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్రంలో ఈ చిత్రం విడుదలను నిషేధిస్తామని హెచ్చరించింది.
కన్నడ భాషపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని ఆయన అన్నారు. చివరకు కోర్టు హెచ్చరించినా కమల్ హాసన్ వెనక్కి తగ్గలేదు. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకపోయినా ఫర్వాలేదనుకున్నారు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
థగ్ లైఫ్ సినిమా విషయానికొస్తే త్రిష, సిలంబరసన్, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్, అభిరామి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మాస్ట్రో ఏఆర్ రెహమాన్. ఎడిటర్ ఎ.శ్రీకర్ ప్రసాద్. ఈ చిత్రం గురించి హిందుస్తాన్ టైమ్స్ సమీక్షలో ఒక భాగం ఇలా ఉంది.. "ఈ సినిమాను బాధించేది 'పాత సీసాలో పాత వైన్' స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో ఎమోషన్స్, ఇంటెన్స్ యాక్షన్, కొంత రొమాన్స్ ఉన్నప్పటికీ స్టోరీ లైన్ వీక్ గా ఉండటం నష్టం చేసింది. రొమాన్స్, యాక్షన్ మాత్రం అదిరిపోయింది’’ అని రివ్యూలో పేర్కొంది.
సంబంధిత కథనం