Kamal Haasan Indian 2: 2018లో షూటింగ్ షురూ - 2024లో కంప్లీట్ - ఇండియ‌న్ 2కు గుమ్మ‌డికాయ కొట్టిన క‌మ‌ల్‌, శంక‌ర్-kamal haasan shankar indian 2 movie shooting finally wrapped up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan Indian 2: 2018లో షూటింగ్ షురూ - 2024లో కంప్లీట్ - ఇండియ‌న్ 2కు గుమ్మ‌డికాయ కొట్టిన క‌మ‌ల్‌, శంక‌ర్

Kamal Haasan Indian 2: 2018లో షూటింగ్ షురూ - 2024లో కంప్లీట్ - ఇండియ‌న్ 2కు గుమ్మ‌డికాయ కొట్టిన క‌మ‌ల్‌, శంక‌ర్

Nelki Naresh Kumar HT Telugu
Jan 02, 2024 08:39 AM IST

Kamal Haasan Indian 2: ఇండియ‌న్ 2 షూటింగ్ పూర్త‌యింది. సోమ‌వారం ఈ సీక్వెల్ మూవీకి గుమ్మ‌డికాయ‌కొట్టేశారు క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్‌. దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న ఈ మూవీ ఈ ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

కమ‌ల్ హాస‌న్‌ ఇండియ‌న్ 2 మూవీ
కమ‌ల్ హాస‌న్‌ ఇండియ‌న్ 2 మూవీ

Kamal Haasan Indian 2: క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. ఎట్ట‌కేల‌కు ఇండియ‌న్ 2 షూటింగ్‌నుపూర్తిచేశాడు. చెన్నైలో జ‌రిగిన తాజా షెడ్యూల్‌తో ఇండియ‌న్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇండియ‌న్ 2 షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా సినిమా యూనిట్‌తో క‌మ‌ల్‌హాస‌న్ ఓ ఫొటో దిగాడు. క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు శంక‌ర్ కెరీర్‌లో ఎక్కువ కాలం షూటింగ్‌ను జ‌రుపుకున్న మూవీగా ఇండియ‌న్ 2 నిలిచింది.

yearly horoscope entry point

2015లో ఇండియ‌న్ మూవీని శంక‌ర్ అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొద‌లైంది. షూటింగ్‌లో క్రేన్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, నిర్మాణ సంస్థ లైకాతో శంక‌ర్‌కు విభేదాలు ఏర్ప‌డ‌టంతో 2020లో ఇండియ‌న్ 2 ఆగిపోయింది. క‌మ‌ల్ హాస‌న్ మీడియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి ఈ వివాదాల్ని ప‌రిష్క‌రించారు.

దాంతో 2022 మేలో ఇండియ‌న్ 2 షూటింగ్‌ను తిరిగి మొద‌లుపెట్టాడు శంక‌ర్‌. ఓ వైపు రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ చేస్తూనే ఇండియ‌న్ 2ను కూడా డైరెక్ట్ చేశాడు శంక‌ర్. దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న ఈ మూవీకి 2024 కొత్త ఏడాది తొలిరోజున క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ గుమ్మ‌డికాయ కొట్టేశారు.

ఇండియ‌న్ -2లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా సిద్ధార్థ్‌తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేస‌విలో ఇండియ‌న్ 2 మూవీని రిలీజ్ చేసేందుక నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌న్నాహాలు చేస్తోంది. ఇండియ‌న్ 2 మూవీకి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

Whats_app_banner