ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు: కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. చరిత్ర మొత్తం చెప్పేశాడు-kamal haasan on kannada language row says he said it with a lot of love ban thug life movie row ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు: కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. చరిత్ర మొత్తం చెప్పేశాడు

ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు: కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. చరిత్ర మొత్తం చెప్పేశాడు

Hari Prasad S HT Telugu

కన్నడ భాష పుట్టింది తమిళం నుంచి అని చెప్పి పెద్ద వివాదానికి తెర తీసిన కమల్ హాసన్.. తాజాగా మరోసారి దానిపై స్పందించాడు. తాను ఈ విషయం ప్రేమతో చెప్పానని, ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని అనడం గమనార్హం.

ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు: కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. చరిత్ర మొత్తం చెప్పేశాడు (PTI)

థగ్ లైఫ్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ హాసన్.. ఈ మధ్య కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అతడు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని కన్నడ గ్రూపులు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా కమల్ మరోసారి స్పందించాడు. తాను ఎంతో ప్రేమతోనే ఆ మాటలు అన్నట్లు చెప్పడం గమనార్హం.

కమల్ హాసన్ ఏమన్నాడంటే?

థగ్ లైఫ్ మూవీ కన్నడ ప్రమోషన్లలో భాగంగా ఆ భాష అసలు వచ్చిందే తమిళం నుంచి కమల్ అనడంతో వివాదం రేగింది. అతని వ్యాఖ్యల కారణంగా థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తామన్న హెచ్చరికలు వచ్చిన.. కమల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా తన కామెంట్స్ ను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. “నేను చెప్పిన విషయం ఎంతో ప్రేమతోనే చెప్పాను.

భాషల చరిత్రను చరిత్రకారులు నాకు చెప్పారు. అంతే తప్ప అందులో తప్పేమీ లేదు. తమిళనాడు చాలా ఓపెన్ రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాల అలా కాదని నేను అనడం లేదు. కానీ ఇక్కడ ఓ మేనన్ (ఎంజీ రామచంద్రన్) సీఎం అయ్యారు.. ఓ రెడ్డి (రామసామి రెడ్డియర్) సీఎం అయ్యారు. ఓ తమిళియన్ (కరుణానిధి) సీఎం అయ్యారు.. మాండ్యకు చెందిన ఓ కన్నడిగ అయ్యంగార్ సీఎం అయిన అరుదైన రాష్ట్రం ఇది” అని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు.

ఈ చర్చను వాళ్లకు వదిలేద్దాం

కమల్ అంతటితో ఆగలేదు. “అందువల్ల ఈ లోతైన చర్చలను చరిత్రకారులు, పురావస్తు అధికారులు, భాషా నిపుణులకు వదిలేద్దాం. నార్త్ వాళ్ల కోణంలో చూస్తే అది సరైనదే. తెంకుమారి (సౌత్) కోణంలో చూస్తే నేను చెప్పిందే కరెక్ట్. దీనికి మూడో కోణం కూడా ఉంది. స్కాలర్స్, భాషా నిపుణుల కోణం. ఇది సమాధానం కాదు.. వివరణ. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదు” అని కమల్ స్పష్టం చేశాడు.

మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో 37 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ ఈ థగ్ లైఫ్. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లు కలిసి సినిమా తీశారు. జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో కమల్ హాసన్ తోపాటు శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్ లాంటి వాళ్లు నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం