Kamal Haasan Hospitalised: కమల్ హాసన్‌కు అస్వస్థత - ఆసుపత్రిలో చేరిక
Kamal Haasan Hospitalised: అగ్ర హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. చెన్నైలోని పోరూరు రామచంద్ర హాస్పిటల్‌లో కమల్‌హాసన్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Kamal Haasan Hospitalised: అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని పోరూరు రామచంద్ర హాస్పిటల్‌కు తరలించారు. కమల్‌హాసన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కమల్‌హాసన్‌ను హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు సమాచారం.

మరోవైపు రెగ్యులర్ చెకప్ కోసమే కమల్‌హాసన్ హాస్పిటల్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం రోజు సీనియర్ డైరెక్టర్ కె. విశ్వనాథ్‌ను కలిశారు కమల్‌హాసన్. హైదరాబాద్‌లోని విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లారు. దిగ్గజ దర్శకుడితో చాలా సమయం పాటు గడిపిన కమల్‌హాసన్ బుధవారం చెన్నై తిరిగి వెళ్లారు.
కమల్‌హాసన్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విక్రమ్ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత పెద్ద విజయాన్ని అందుకున్నారు కమల్‌హాసన్. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా విక్రమ్ నిలిచింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్.