Vikram Movie: డైరెక్టర్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్‌-kamal haasan gifts a lexus car to director lokesh kanagaraj after the success of vikram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan Gifts A Lexus Car To Director Lokesh Kanagaraj After The Success Of Vikram

Vikram Movie: డైరెక్టర్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్‌

Hari Prasad S HT Telugu
Jun 07, 2022 06:49 PM IST

తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ ఇచ్చిన మూవీ విక్రమ్‌ సక్సెస్‌ను కమల్‌ హాసన్‌ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ సక్సెస్‌కు కారణమైన ఫ్యాన్స్‌కు అన్ని భాషల్లో కృతజ్ఞతలు చెప్పడంతోపాటు డైరెక్టర్‌కు ఓ కాస్ట్‌లీ కారునూ గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం.

డైరెక్టర్ లోకేష కు కారు అందజేస్తున్న కమల్ హాసన్
డైరెక్టర్ లోకేష కు కారు అందజేస్తున్న కమల్ హాసన్

కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాసిల్‌ నటించిన యాక్షన్‌ మూవీ విక్రమ్‌ బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. ఈ మూవీ దెబ్బకు బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ తీవ్రంగా నష్టపోయింది. విక్రమ్‌ మూవీ అంచనాలకు అందని విధంగా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.175 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం.

ఈ మూవీ సక్సెస్‌ కావడంతో మంగళవారం ఉదయం కమల్‌ హాసన్‌ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కావడంతో తాను కూడా ఆ ఐదు భాషల్లోనూ థ్యాంక్స్‌ చెబుతూ వీడియోలు రిలీజ్‌ చేశాడు. విక్రమ్‌ మూవీని తనే నిర్మించడంతో కమల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదే ఆనందంలో ఇప్పుడతను మూవీ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌కు ఓ కాస్ట్‌లీ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు.

లెక్సస్‌ కంపెనీకి చెందిన కారు అది. లోకేష్‌కు కమల్‌ కారు అందిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ లోకేష్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. విక్రమ్‌ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ లవర్స్‌కు ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో బాక్సాఫీస్‌ దగ్గర సామ్రాట్‌ పృథ్వీరాజ్‌, మేజర్‌లాంటి సినిమాల పోటీని తట్టుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో సూర్య అతిథి పాత్రలో కనిపించడం కూడా అభిమానులకు బాగా నచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్