థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయినా.. ఓటీటీలో సూపర్ స్టార్.. టాప్ ప్లేస్‍కు కమల్ హాసన్ సినిమా-kamal haasan action drama movie thug life now trending top in netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయినా.. ఓటీటీలో సూపర్ స్టార్.. టాప్ ప్లేస్‍కు కమల్ హాసన్ సినిమా

థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయినా.. ఓటీటీలో సూపర్ స్టార్.. టాప్ ప్లేస్‍కు కమల్ హాసన్ సినిమా

థగ్ లైఫ్ చిత్రానికి ఓటీటీలో మంచి ఆరంభం దక్కింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. థియేటర్లలో ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. స్ట్రీమింగ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయినా.. ఓటీటీలో సూపర్ స్టార్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ భారీ అంచనాలను రేపింది. 37ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవడంతో ముందు నుంచి ఈ తమిళ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఈ మూవీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. జూన్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన థగ్ లైఫ్ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అయితే, ఓటీటీలో మంచి స్టార్ట్ దక్కించుకుంది.

ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు..

థగ్ లైఫ్ చిత్రం ఈ గురువారం (జూలై 3) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలోనూ అడుగుపెట్టింది. స్ట్రీమింగ్‍లో ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోగానే నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.

థియేటర్లలో రిలీజైన నెలలోగానే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి థగ్ లైఫ్ అడుగుపెట్టింది. ముందుగా ఎనిమిది వారాల తర్వాత తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. అయితే, బాక్సాఫీస్ వద్ద నిరాశపరచటంతో ముందుగానే తీసుకొచ్చేశారు. ప్రస్తుతం (జూలై 5) ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. మంచి స్టార్ట్ సొంత చేసుకుంది. ట్రెండింగ్‍లో ఎంతకాలం జోరు కొనసాగిస్తుందో చూడాలి.

స్ట్రీమింగ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్

థగ్ లైఫ్ సినిమాకు థియేట్రికల్ రిలీజ్‍లో ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో అసలు కలెక్షన్లు దక్కలేదు. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఓటీటీలో చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. థగ్ లైఫ్ చిత్రం ఔట్‍డేటెడ్‍గా, సాగదీతగా అనిపించిందని కొందరు అంటుంటే.. మరీ అంత బ్యాడ్‍గా లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సీన్లు బాగున్నాయని, సినిమా పర్వాలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా స్ట్రీమింగ్ తర్వాత మిశ్రమ స్పందనను థగ్ లైఫ్ దక్కించుకుంటోంది.

థగ్ లైఫ్ చిత్రంలో రంగరాయ శక్తివేల్ అనే గ్యాంగ్‍స్టర్ పాత్రను కమల్ హాసన్ పోషించారు. శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజూ జార్జ్, నాజర్, మహేశ్ మంజ్రేకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని మణిరత్నం తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన మ్యాజిక్ చూపలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బాక్సాఫీస్ ప్లాఫ్

థగ్ లైఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ దాదాపు రూ.90కోట్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రం దక్కించుకుంది. ఏ మాత్రం అంచనాలను అందుకోలేక కమర్షియల్ ప్లాఫ్ అయింది. ఈ మూవీని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించారు. మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం