Bimbisara collection: యాభై కోట్ల మార్కుకు చేరువలో బింబిసార కలెక్షన్స్
కళ్యాణ్ రామ్ (Kalyanram) బింబిసార (Bimbisara) చిత్రం రెండో వారంలో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. పది రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
ప్రస్తుతం బింబిసార సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు కళ్యాణ్‌రామ్. అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే నిర్మాతతో పాటు ఎగ్జిబిటర్లు లాభాల బాటపట్టారు. రెండో వారంలో కూడా కార్తికేయ 2 మినహా పెద్దగా సినిమాలేవి విజయాల్ని సాధించకపోవడం బింబిసారకు కలిసివచ్చింది. సెకండ్ వీక్ లో చక్కటి వసూళ్లతో దూసుకుపోతుంది.
పది రోజుల్లో ఏపీ తెలంగాణలో కలిపి ఈ సినిమా 40.92 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్నది. 26.04 కోట్ల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ఇప్పటివరకు 49.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 29.75 కోట్ల షేర్ ను సాధించింది. ఆదివారం రోజు 2.25 కోట్ల గ్రాస్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. హిస్టారికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. సంయుక్తమీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
బాక్సాఫీస్ రెవెన్యూలో టాలీవుడ్(Tollywood) రికార్డ్
కరోనా సంక్షోభం కారణంగా బాలీవుడ్ తో పాటు మిగిలిన సినీ పరిశ్రమలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ టాలీవుడ్ మాత్రం అద్భుత విజయాలతో దూసుకుపోతంది. ఆర్ఆర్ఆర్, సర్కారువారి పాట, ఎఫ్ 3, మేజర్, బింబిసార, సీతారామంతో పాటు తాజాగా కార్తికేయ 2 అద్భుత విజయాల్ని భారీగా వసూళ్లను సొంతం చేసుకుంటున్నాయి. మొత్తంగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ రెవెన్యూ 12515 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2019లో బాక్సాఫీస్ రెవెన్యూ 10948 కోట్లగా నమోదైంది. ఆ రికార్డును 2022 ఏడాదిలో టాలీవుడ్ బ్రేక్ చేసింది.