Amigos Collection Day 2: రెండో రోజు స‌గానికి త‌గ్గిన అమిగోస్ క‌లెక్ష‌న్స్‌-kalyan ram amigos collections huge drop on second day
Telugu News  /  Entertainment  /  Kalyan Ram Amigos Collections Huge Drop On Second Day
క‌ళ్యాణ్ రామ్ అమిగోస్
క‌ళ్యాణ్ రామ్ అమిగోస్

Amigos Collection Day 2: రెండో రోజు స‌గానికి త‌గ్గిన అమిగోస్ క‌లెక్ష‌న్స్‌

12 February 2023, 13:53 ISTHT Telugu Desk
12 February 2023, 13:53 IST

Amigos Collection Day 2: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ క‌లెక్ష‌న్స్ రెండో రోజు భారీగా త‌గ్గాయి. ఓవ‌రాల్‌గా రెండు రోజుల్లో ఈసినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

Amigos Collection Day 2: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా క‌లెక్ష‌న్స్ రెండో రోజు భారీగా డ్రాప్ అయ్యాయి. తొలిరోజు రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కోటి ప‌ది ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది.

నెగెటివ్ టాక్ కార‌ణంగానే క‌లెక్ష‌న్స్ త‌గ్గిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏడు కోట్ల‌కుపైగా గ్రాస్‌ను మూడు కోట్ల ఎన‌భై ల‌క్ష‌ల‌ షేర్‌ను అమిగోస్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఆదివారం రోజు వ‌సూళ్ల‌పైనే ఈ సినిమా రిజ‌ల్ట్ డిసైడ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. బ్రేక్ ఈవెన్ కావాలంటే మ‌రో ఏడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రావాల్సి ఉన్న‌ట్లు తెలిసింది.

ఒకే రూపంలో ఉన్న ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి అమిగోస్‌ సినిమాను తెర‌కెక్కించారు. పాయింట్ బాగున్నా దానిని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది.

ఇందులో సిద్ధార్థ్‌, మైఖేల్‌, మంజునాథ్ అనే మూడు క్యారెక్ట‌ర్స్‌లో క‌ళ్యాణ్ రామ్ న‌టించాడు. త‌మ పోలిక‌ల‌తోనే ఉన్న మైఖేల్ కార‌ణంగా సిద్ధార్థ్‌, మంజునాథ్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డార‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. నెగెటివ్‌తో పాటు పాజిటివ్ షేడ్స్‌లోకూడిన క్యారెక్ట‌ర్‌లో అత‌డి న‌ట‌న అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.