Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ, కల్కి కన్‍ఫ్యూజన్: థియేటర్లు ఫుల్.. స్పందించిన బుక్ మై షో.. నాకేం సంబంధం లేదన్న రాజశేఖర్
Kalki 2898 AD Booking: కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్‍లో కాస్త కన్‍ఫ్యూజన్ నెలకొంది. బుక్‍మైషోలో రాజశేఖర్ ‘కల్కి’ సినిమా టికెట్లు కొందరు బుక్ చేసుకున్నారు. ఈ విషయంపై బుక్‍మైషో స్పందించింది. రాజశేఖర్ కూడా ట్వీట్ చేశారు.
Kalki 2898 AD Booking: కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్‍లు మొదలయ్యాయి. పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో హైదరాబాద్‍లో నేడు (జూన్ 23) ఆన్‍లైన్ టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. భారీ రేంజ్‍లో క్రేజ్ ఉండటంతో కొన్ని థియేటర్లు నిమిషాల్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే, టికెట్ల బుకింగ్ ప్లాట్‍ఫామ్ ‘బుక్‍మైషో’లో ఓ కన్‍ఫ్యూజన్ నెలకొంది. సీనియర్ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి టికెట్లను కొందరు బుక్ చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై బుక్‍మైషో క్లారిటీ ఇచ్చింది.
షాకైన యూజర్లు
కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్స్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఓపెన్ కాగానే చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం కూడా కనిపించింది. దీంతో కన్‍ఫ్యూజన్ క్రియేట్ అయింది. టికెట్లు బుక్ అయిన తర్వాత అది రాజశేఖర్ ‘కల్కి’ అని చూసుకొని కొందరు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుక్‍మైషోకు ట్యాగ్ చేశారు.
బుక్‍మైషో ఏం చెప్పిందంటే..
ఈ కన్‍ఫ్యూజన్‍పై బుక్‍మైషో ప్లాట్‍ఫామ్ స్పందించింది. రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి కల్కి 2898 ఏడీ సినిమా టికెట్లు కన్‍ఫామ్ అయినట్టేనని క్లారిటీ ఇచ్చింది. ఈ సమస్యను త్వరలోనే ఫిక్స్ చేస్తామని ట్వీట్ చేసింది. మొత్తంగా రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్న వారికి కూడా కల్కి 2898 ఏడీ టికెట్లు ఉన్నట్టేనని చెప్పింది. దీంతో గందరగోళానికి తెరపడింది.
నాకు సంబంధం లేదు
ప్రభాస్ కల్కి 2898 ఏడీ కాకుండా రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లను ప్రజలు బుక్ చేసుకున్నారని, భ్రమరాంబ థియేటర్లలో 6 షోలు ఫుల్ అయ్యాయని ఓ ట్వీట్ పోస్ట్ అయింది. దీనికి రాజశేఖర్ సరదాగా స్పందించారు. కల్కి టీమ్‍కు విషెస్ కూడా చెప్పారు. “నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే.. ప్రభాస్, నాగ్అశ్విన్, అశ్వినీదత్ సహా కల్కి టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. చరిత్ర సృష్టించి, మూవీ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించాలని ఆకాంక్షిస్తున్నా” అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
కల్కి 2898 ఏడీ సినిమాకు ఓ దశలో గంటకు ఏకంగా బుక్‍మైషో ప్లాట్‍ఫామ్‍లో గంటకు 60వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మూవీకి ఏ రేంజ్‍లో క్రేజ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన వెంటనే ఆ రాష్ట్రంలోనూ బుకింగ్స్ షురూ అవుతాయి. మరికొన్ని గంటల్లోనే జీవో వచ్చే అవకాశం ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమాను మైథాలజీతో సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా కొందరు స్టార్ యాక్టర్ల క్యామియోలు కూడా ఈ మూవీలో ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది.
టాపిక్