Kalki 2898 AD Ticket Price: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయా? అర్ధరాత్రి షోలు కూడా..-kalki 2898 ad ticket prices to hike in ap and telangana midnight shows to return ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Ticket Price: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయా? అర్ధరాత్రి షోలు కూడా..

Kalki 2898 AD Ticket Price: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయా? అర్ధరాత్రి షోలు కూడా..

Hari Prasad S HT Telugu
Jun 11, 2024 04:01 PM IST

Kalki 2898 AD Ticket Price: కల్కి 2898 ఏడీ మూవీ బజ్ తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచాన్నే చుట్టుముట్టేసింది. అయితే ఈ సినిమా కోసం టికెట్ల ధరలను రెండు రాష్ట్రాల్లోనూ పెంచే అవకాశం ఉండటంతోపాటు అర్ధరాత్రి షోలు కూడా తిరిగి రానున్నాయి.

కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయా? అర్ధరాత్రి షోలు కూడా..
కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయా? అర్ధరాత్రి షోలు కూడా..

Kalki 2898 AD Ticket Price: కల్కి 2898 ఏడీ మూవీ కోసం టికెట్ల ధరలు భారీగా పెంచనున్నారా? ఏ పెద్ద సినిమా రిలీజైనా మేకర్స్ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అనుమతితో టికెట్ల ధరలను కొన్ని రోజుల పాటు పెంచడం సహజమే. ఇక ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల ధరలు పెరగడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

yearly horoscope entry point

కల్కి 2898 ఏడీ టికెట్ల ధరలు ఇలా?

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఏదో ఒక రూపంలో మూవీ ప్రమోషన్లతో ఈ సినిమా ప్రేక్షకుల నోళ్లలో నానే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ తో ఈ హైప్ మరో స్థాయికి చేరింది. దీంతో దీనిని క్యాష్ రూపంలోకి మార్చుకోవడానికి టికెట్ల ధరలు పెంచే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

దీనికోసం ఆయా ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి టికెట్ల ధరల పెంపు భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అయితే మల్టీప్లెక్స్ లలో రూ.413 వరకు, సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.236 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు ఏపీలో అయితే ఈ టికెట్ల ధరలు రూ.206 నుంచి రూ.354 వరకు ఉండవచ్చు.

అర్ధరాత్రి షోలు కూడా వస్తాయా?

కల్కి 2898 ఏడీ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని ఇండియన్ సినిమా రికార్డులూ బ్రేకవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. టికెట్ల ధరల పెంపుతోపాటు మూవీకి ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత షోల కోసం కూడా అనుమతి కోరనున్నారు. అదే జరిగితే జూన్ 26 అర్ధరాత్రి తర్వాత నుంచే కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే ఉంది. థియేట్రికల్, డిజిటల్ హక్కుల రూపంలోనే మేకర్స్ కు తాము పెట్టిన బడ్జెట్ తో పెద్దమొత్తం తిరిగి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్, టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలతోనూ పెద్ద మొత్తం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమాకు తొలి షో నుంచే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఇక తిరుగుండదు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తర్వాత సలార్ తో మళ్లీ గాడిలో పడిన ప్రభాస్.. ఈ కల్కి 2898 ఏడీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మూవీ ట్రైలర్ కూడా అభిమానులు, ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఉండబోతోందని ట్రైలర్ ద్వారానే స్పష్టమైంది.

ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. అయితే బిగ్ బీతోపాటు దీపికా, కమల్ కూడా తెలుగులోనూ తామే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక ఈ మూవీ జూన్ 26 రాత్రి 8.30 గంటలకు బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్ లోనూ ప్రీమియర్ ఉండనుంది.

Whats_app_banner