Kalki 2898 AD: ఐమ్యాక్స్‌లో ఒకరోజు ముందుగానే కల్కి 2898 ఏడీ రిలీజ్.. మరో ట్రైలర్ తీసుకురానున్న మేకర్స్-kalki 2898 ad telugu version to premier in bfi imax a day before its world wide release makers to unveil another trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: ఐమ్యాక్స్‌లో ఒకరోజు ముందుగానే కల్కి 2898 ఏడీ రిలీజ్.. మరో ట్రైలర్ తీసుకురానున్న మేకర్స్

Kalki 2898 AD: ఐమ్యాక్స్‌లో ఒకరోజు ముందుగానే కల్కి 2898 ఏడీ రిలీజ్.. మరో ట్రైలర్ తీసుకురానున్న మేకర్స్

Hari Prasad S HT Telugu
Published Jun 11, 2024 07:23 AM IST

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ మానియా మొదలైంది. ఈ సినిమా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్ లో ఒక రోజు ముందే రిలీజ్ కానుండగా.. మరో ట్రైలర్ కూడా మేకర్స్ తీసుకురానున్నారు.

ఐమ్యాక్స్‌లో ఒకరోజు ముందుగానే కల్కి 2898 ఏడీ రిలీజ్.. మరో ట్రైలర్ తీసుకురానున్న మేకర్స్
ఐమ్యాక్స్‌లో ఒకరోజు ముందుగానే కల్కి 2898 ఏడీ రిలీజ్.. మరో ట్రైలర్ తీసుకురానున్న మేకర్స్

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్ లో ఒక రోజు ముందే ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ ఉండనుంది. ఈ ఘనత సాధించబోతున్న రెండో తెలుగు సినిమాగా నిలవనుంది. మరోవైపు మేకర్స్ మూవీ రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

బీఎఫ్ఐ ఐమ్యాక్స్‌లో కల్కి 2898 ఏడీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మానియా ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుండగా.. తాజాగా సోమవారం (జూన్ 10) ట్రైలర్ రిలీజ్ తోనే మేకర్స్ ఈ మానియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కళ్లు చెదిరిపోయేలా ఉన్న ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరికీ విపరీతంగా నచ్చేసింది. మొత్తం యాక్షన్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్ లో ప్రీమియర్ కానుంది. ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26 రాత్రి 8.30 గంటలకు ఐమ్యాక్స్ లో కల్కి 2898 ఏడీ మూవీ ప్రీమియర్ ఉంటుంది. ఈ ఘనత సాధించిన రెండో తెలుగు సినిమా ఇదే. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని కూడా ఇక్కడ ప్రదర్శించారు. లండన్ లోని ఈ ప్రతిష్టాత్మక ఐమ్యాక్స్ లో ప్రభాస్ అండ్ టీమ్ ప్రపంచ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు.

కల్కి 2898 ఏడీ మరో ట్రైలర్

ఇక ఇప్పటికే వచ్చిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. తొలి 12 గంటల్లోనే కేవలం తెలుగు వెర్షన్ ట్రైలర్ కే 7.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక హిందీలో మరో 6.2 మిలియన్, తమిళంలో 1 మిలియన్, మలయాళంలో 0.41 మిలియన్, కన్నడలో 0.21 లక్షల వ్యూస్ రావడం విశేషం. అంటే మొత్తంగా అన్ని భాషల్లో కలిపి సుమారు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

కళ్లు చెదిరే గ్రాఫిక్స్, స్టంట్స్ తో కల్కి 2898 ఏడీ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా రిలీజ్ కు ముందు మేకర్స్ మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటి వరకూ చూడని పాత్రలు, విజువల్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూన్ 27న మూవీ రిలీజ్ కానుండగా.. కొన్ని రోజుల ముందు ఈ రెండో ట్రైలర్ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో ఈ ముఖ్యమైన పాత్రలన్నీ కనిపించాయి. అంతేకాదు అమితాబ్, దీపికా, కమల్ లాంటి వాళ్లు తెలుగులోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. అశ్వత్థామ పాత్రలో ఈ వయసులోనూ బిగ్ బీ చేసిన స్టంట్స్ ఆకట్టుకోగా.. విలన్ పాత్రలో కమల్ హాసన్ ట్రైలర్ చివర్లో కనిపించాడు.

Whats_app_banner