Kalki Collections: తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి జోరు - 3 రోజుల్లో 130 కోట్లు - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?-kalki 2898 ad telugu collections and break even target prabhas kalki day 3 collections deepika padukone nag ashwin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Collections: తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి జోరు - 3 రోజుల్లో 130 కోట్లు - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Kalki Collections: తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి జోరు - 3 రోజుల్లో 130 కోట్లు - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 30, 2024 01:11 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. మూడు రోజుల్లో 132 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌, 84 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ ను ప్ర‌భాస్ మూవీ ద‌క్కించుకున్న‌ది. తెలుగులో క‌ల్కి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

క‌ల్కి 2898 ఏడీ క‌లెక్ష‌న్స్
క‌ల్కి 2898 ఏడీ క‌లెక్ష‌న్స్

Kalki Collections: బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. ఈ సూప‌ర్ హీరో మూవీ మూడు రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్ల మైలురాయిని దాటింది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన ప్ర‌భాస్ ఆరో మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. మూడు రోజుల్లో క‌ల్కి సినిమా 350 కోట్ల‌కుపైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను, 220 కోట్ల వ‌ర‌కు నెట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

శ‌నివారం రోజు ప్ర‌భాస్‌ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్‌గా 67 కోట్ల వ‌ర‌కు క‌లెక్షన్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. వీకెండ్ లోగా ఈ మూవీ ఐదు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజు 31 కోట్లు...

తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. శ‌నివారం రోజు తెలంగాణ‌, ఏపీలో కలిపి క‌ల్కి 2898 ఏడీ 31 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్, 19. 80 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నైజాంలో శ‌నివారం రోజు ఈ సినిమా 10 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

సీడెడ్‌లో 2.40 కోట్లు, ఉత్త‌రాంధ్రాలో రెండు కోట్ల‌తో పాటు మిగిలిన ఏరియాల‌లో కోటికిపైనే ఈ సినిమా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. మూడు రోజుల్లో 132 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌, 84 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ క‌ల్కి మూవీకి వ‌చ్చాయి.

క‌ల్కి ప్రీ రిలీజ్ బిజినెస్…

తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి 2898 ఏడీ మూవీ 168 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. తెలుగులో ప్ర‌భాస్ మూవీ బ్రేక్ కావాలంటే మ‌రో 86 కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల్సివుంది.

ఆదివారం రోజు తో తెలుగులో షేర్ క‌లెక్ష‌న్స్ వంద కోట్ల మార్కును దాటే అవ‌కాశం ఉంది. సినిమాపై భారీగా బ‌జ్ ఉండ‌టం, ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో మ‌రో రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క‌ల్కి చేరుకోవ‌డం ప‌క్కా అని అంటున్నారు. ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోగా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు లాభాల్లోకి అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

మ‌హాభార‌తం ఆధారంగా...

మ‌హాభార‌తం, క‌ల్కి అవ‌తారం లాంటి భార‌తీయ పురాణాల‌కు గ్రాఫిక్స్‌, యాక్ష‌న్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని రూపొందించాడు. ఈ సినిమాలో భైర‌వ అనే సూప‌ర్ హీరోగా, క‌ర్ణుడిగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ క‌నిపించాడు. సినిమాలో ప్ర‌భాస్ కామెడీ టైమింగ్‌, అత‌డిపై చిత్రీక‌రించిన‌ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్ మ‌ధ్య వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్‌ల‌ను థియేట‌ర్ల‌లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తోన్నారు.

గెస్ట్ రోల్స్‌...

క‌ల్కి మూవీలో దీపికా ప‌దుకోణ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న‌కు పుట్ట‌బోయే బిడ్డ కోసం ఆరాట‌ప‌డే త‌ల్లిగా ఓ ఎమోష‌న‌ల్ రోల్‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌ను దీపికా క‌న‌బ‌రిచింది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టించ‌గా...అశ్వ‌త్థామ‌గా ప్ర‌భాస్‌కు ధీటైన పాత్ర‌లో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్ క‌నిపించాడు. క‌ల్కి 2898 ఏడీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటు డైరెక‌ర్లు రాజ‌మౌళి, ఆర్‌జీవీ, అనుదీప్‌, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌, ఫ‌ఱియా అబ్దుల్లా గెస్టు రోల్స్‌లో క‌నిపించారు.

క‌ల్కి క‌థ ఇదే...

కాంప్లెక్స్ శంబాలా అనే రెండు డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్ చుట్టూ క‌ల్కి క‌థ‌ను రాసుకున్నారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. కాంప్టెక్స్ పేరుతో కొత్త వ‌ర‌ల్డ్‌ను క్రియేట్ చేసిన సుప్రీమ్ యాశ్కిన్ ప్ర‌కృతి వ‌న‌రుల‌ను త‌న ఆధీనంలో ఎందుకు పెట్టుకున్నాడు. ప్రాజెక్ట్ కే పేరుతో అత‌డు చేసిన ప్ర‌యోగం ఏమిటి? కాంప్టెక్స్ నుంచి త‌ప్పించుకున్న సుమ‌తి ఎవ‌రు? ఆమెను అశ్వ‌త్థామ‌తో క‌లిసి భైర‌వ ఎలా కాపాడాడు అన్న‌దే క‌ల్కి మూవీ క‌థ‌. క‌ల్కి మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సీక్వెల్‌కు సంబంధించి అర‌వై శాతం షూటింగ్ పూర్త‌యిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

WhatsApp channel