Sr NTR in Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?-kalki 2898 ad reportedly have sr ntr cameo with artificial intelligence ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sr Ntr In Kalki 2898 Ad: కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?

Sr NTR in Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 26, 2024 06:44 PM IST

Kalki 2898 AD - Sr NTR: కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో దిగ్గజం సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారని రూమర్లు వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడీ చిత్రం రిలీజ్‍కు రెడీ అయింది. రేపు (జూన్ 27) ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో చాలా సర్‌ప్రైజ్‍లు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్‌తో పాటు కొందరు స్టార్ నటీనటుల క్యామియో రోల్స్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని తెలుస్తోంది. ఈ తరుణంలో కల్కి 2898 ఏడీ గురించి తాజాగా ఓ రూమర్ బయటికి వచ్చింది. విశ్వవిఖ్యాత దిగ్గజ నటుడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నారని టాక్ బయటికి వచ్చింది.

ఏఐ సాయంతో..

కల్క 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్‍ఎక్స్‌లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది.

శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ సినిమాను నిర్మిస్తున్న లెజెండరీ ప్రొడ్యూజర్ అశ్వినీదత్‍కు ఎన్టీఆర్‌తో చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ బ్యానర్‌కు వైజయంతీ మూవీస్ అని పేరు పెట్టింది కూడా ఎన్టీఆరే. ఆయనతో చాలా సినిమాను నిర్మించారు అశ్వినీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోలో కూడా శ్రీకృష్ణుడి అవతారంలో ఉండే ఎన్టీఆర్ ఉంటారు.

దీంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో ఎన్టీఆర్ పాత్రను క్రియేట్ చేశారని తెలుస్తోంది . మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ విషయంపై స్పష్టత రానుంది.

క్యామియో రోల్స్!

కల్కి 2898 ఏడీ సినిమాలో చాలా మంది స్టార్ల క్యామియో రోల్స్ ఉంటాయని చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రానా దగ్గుబాటి ఈ మూవీలో కనిపిస్తారనే అంచనాలు ఉన్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ చిత్రంలో ఉంటారనే రూమర్లు వచ్చాయి. ఈ విషయాలపై ఇప్పటి వరకు మూవీ టీమ్ స్పష్టత ఇవ్వలేదు. సినిమాలోనే చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవ్వాలని భావిస్తోంది. మరి కల్కి 2898 ఏడీ చిత్రంలో ఎవరెవరి క్యామియో రోల్స్ ఉంటాయో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది.

కల్కి 2898 ఏడీ సినిమాను భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ ఫ్యుచరస్టిక్ మూవీగా రూపొందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా ఉండటంతో పాటు కథలో చాలా మలుపులు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ చిత్రానికి భారీ స్థాయిలో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‍లు జరుగుతున్నాయి. ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పెద్దగా ప్రమోషన్ల చేయకపోయినా ప్రభాస్ స్టార్‌డమ్, ట్రైలర్లతోనే ఈ మూవీకి చాలా హైప్ వచ్చింది. రేపు (జూన్ 27) ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

WhatsApp channel