Kalki 2898 AD Update: కల్కి 2898 ఏడీ సినిమా అప్‍డేట్‍కు ముహూర్తం ఖరారు.. కొత్త రిలీజ్ డేట్!
Kalki 2898 AD Release Date Update: కల్కి 2898 ఏడీ సినిమా అప్‍డేట్‍కు ముహూర్తం ఫిక్స్ అయింది. డేట్, టైమ్‍ను మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ రానుంది. అలాగే, కొత్త రిలీజ్ డేట్ కూడా వెల్లడయ్యే ఛాన్స్ అధికంగా ఉంది.
Kalki 2898 AD Update: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు ఓ క్లారిటీ రానుంది. ఎట్టకేలకు ఓ అప్‍డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ మే 9న రిలీజ్ కావాల్సింది. అయితే, వాయిదా పడడం ఖాయమైంది. కొత్త రిలీజ్ డేట్ కోసం అందరూ నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో మూవీ నుంచి ఓ అప్‍డేట్ వస్తోంది.
అమితాబ్ బచ్చన్ గ్లింప్స్.. డేట్, టైమ్
కల్కి 2898 చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు డేట్, టైమ్ ఫిక్స్ చేసింది మూవీ టీమ్. రేపు (ఏప్రిల్ 21) సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఈ గ్లింప్స్ తీసుకురానుంది. అమితాబ్ బచ్చన్ కొత్త పోస్టర్‌ను వెల్లడించింది.
స్పోర్ట్స్ ఛానెల్‍లో..
ఐపీఎల్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‍లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేయనుంది కల్కి టీమ్. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. “ఆయన ఎవరో తెలుసుకునేందుకు సమయం వచ్చింది. ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‍లో ప్రత్యేకంగా రానుంది” అని కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నేడు (ఏప్రిల్ 20) ట్వీట్ చేసింది.
విడుదల తేదీ కూడా!
అమితాబ్ బచ్చన్ గ్లింప్స్‌తో పాటే కల్కి 2898 ఏడీ సినిమా కొత్త రిలీజ్ డేట్‍ను కూడా మూవీ టీమ్ వెల్లడించే అవకాశం ఉంది. మే 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఎన్నికల కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ లేదా జూలైలో ఈ మూవీ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్‍పై రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమా గ్లోబల్ రేంజ్‍లో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీంతో.. రిలీజ్ డేట్ మార్పుపై తీవ్రంగా కసరత్తులు చేసిందని సమాచారం.
కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి స్ఫూర్తిగా ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నారు. ఈ చిత్రం కోసం ఓ కొత్త ప్రపంచాన్నే ఆయన సృష్టించారని తెలుస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో తీసుకురానున్నారు. సుమారు రూ.600 కోట్లతో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా ఈ మూవీ రూపొందింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటానీ, పశుపతి, స్వస్థ చటర్జీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతం అందించగా.. స్టోజిల్‍కోవిచ్ సినిమాటోగ్రఫీ చేశారు.
టాపిక్