Kalki 2898 AD Release Trailer: కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడు వస్తోందంటే?
Kalki 2898 AD Release Trailer: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ ట్రైలర్ వచ్చేస్తోంది. ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీమ్.. గురువారం ఈ రెండో ట్రైలర్ డేట్, టైమ్ రివీల్ చేసింది.
Kalki 2898 AD Release Trailer: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఇప్పుడీ మూవీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ దగ్గర పడింది. ఇప్పటికే ఓ ట్రైలర్, భైరవ ఆంథెమ్, ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ లాంటివి చేసిన మేకర్స్.. ఇక చివరిగా మరో ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్
కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ శుక్రవారం (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వైజయంతీ మూవీస్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "భవిష్యత్తు కోసం సిద్ధం కండి. కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది. ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ రాబోతోందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
పైగా ఈ ట్రైలర్ కాస్త లీకవడంతో త్వరగా రిలీజ్ చేయడమే బెటర్ అని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. తొలి ట్రైలర్ లో చూడని విజువల్స్ తో ఈ రెండో ట్రైలర్ సిద్ధమైంది. పైగా మొదటి ట్రైలర్ ద్వారా మూవీ స్టోరీ ఏంటన్నది అసలు రివీల్ కాలేదు. ఇప్పుడీ మూవీ కథేంటన్నది డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించిన నేపథ్యంలో రిలీజ్ ట్రైలర్ ద్వారా మూవీ గురించి మరింత తెలిసే అవకాశం ఉంది.
ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఈ సెకండ్ ట్రైలర్ తర్వాత ఇండియాలోనూ బుకింగ్స్ ప్రారంభం కావచ్చు. ఈ ట్రైలర్ కూడా అంచనాలకు తగినట్లే ఉంటే.. భారీ ఓపెనింగ్స్ ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీకి ఊహకు కూడా అందని ఓపెనింగ్స్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
కల్కి 2898 ఏడీ రన్ టైమ్
ఇక ఈ కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక మూవీ రన్ టైమ్ 3 గంటల 56 సెకన్లుగా ఉండటం విశేషం. యానిమల్ మూవీ తర్వాత మూడు గంటలకుగాపై నిడివి గల మూవీగా నిలవబోతోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెబుతూ.. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథగా చెప్పాడు.
ఈ స్టోరీపై రిలీజ్ ట్రైలర్ లో మరింత స్పష్టత రావచ్చు. దీంతో ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ముంబైలో ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్ పూర్తవగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇక్కడ మాత్రం సినిమా ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండనుంది అనడంలో సందేహం లేదు. రిలీజ్ కు ముందు మేకర్స్ చేయబోయే అతిపెద్ద ప్రమోషన్ కూడా అదే కానుంది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.