Kalki 2898 AD OTT Release Date: కల్కి 2898 ఏడీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో చెప్పిన మేకర్స్
Kalki 2898 AD OTT Release Date: కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు మేకర్స్ నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేసింది. ఈ ప్రభాస్ మూవీ ఇప్పట్లో డిజిటల్ ప్రీమియర్ ఉండబోవడం లేదు.

Kalki 2898 AD OTT Release Date: కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడన్న ప్రశ్నకు తెరపడినట్లే. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై స్పష్టమైన తేదీ చెప్పకపోయినా.. ఇప్పట్లో మాత్రం రాదని తేలిపోయింది. ఈ మధ్యే రూ.1000 కోట్ల అరుదైన క్లబ్ లో చేరిన ఈ ప్రభాస్ మూవీ పది వారాల తర్వాతే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ డేట్
ఎపిక్ బ్లాక్‌బ్లాస్టర్ అంటూ కల్కి 2898 ఏడీ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా ఉంది. రిలీజ్ తర్వాత మూడో వారంలోకి ఎంటరైనా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో ఇండియన్ సినిమాగానూ చరిత్ర సృష్టించింది. దీంతో అన్ని సినిమాల్లాగా ఈ మూవీని అంత త్వరగా ఓటీటీలోకి తీసుకురాకూడదని మేకర్స్ నిర్ణయించారు.
రిలీజ్ డేట్ నుంచి పది వారాల తర్వాతే ఈ ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుందని స్పష్టమైంది. అంటే సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలోగానీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉండనుంది. సాధాిరణంగా ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ కల్కి విషయంలో మాత్రం పది వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయించారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రానున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇక కల్కి 2898 ఏడీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోకి వస్తుంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో రానుండగా.. మిగతా భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతాయి.
కల్కి 2898 ఏడీ రూ.1000 కోట్ల సెలబ్రేషన్స్
కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు ఈ మధ్యే మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీలో నటించిన ప్రభాస్, కమల్ హాసన్ లాంటి వాళ్లు ప్రత్యేకంగా వీడియోలు రిలీజ్ చేసి అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తాజాగా మంగళవారం (జులై 16) ఈ మూవీలో యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ ఓ మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేశాడు.
కల్కిలాంటి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, తొలి భాగంలో తాను కొద్దిసేపే కనిపించినా.. రెండో భాగంలో మాత్రం తన పాత్ర నిడివి ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించాడు. ఇదే వీడియోలో కల్కి 2898 ఏడీ షూటింగ్ కు సంబంధించిన క్లిప్ ను కూడా జోడించాడు. ఈ వీడియోను వైజయంతీ మూవీస్ తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే డొమెస్టిక్ వసూళ్లలో ఇప్పటికే యానిమల్ మూవీని మించిపోగా.. షారుక్ ఖాన్ జవాన్ మూవీకి మరో రూ.56 కోట్లు దూరంలో ఉంది. 19 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.584 కోట్లు వసూలు చేయడం విశేషం. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే రూ.1000 కోట్లు మించిపోయాయి. గ్రాస్ వసూళ్లలోనూ షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలను మించిపోనుంది.