Kalki Day 7 Collections: ఏడు రోజుల్లోనే రూ.700 కోట్ల క్లబ్‍లో కల్కి 2898 ఏడీ సినిమా.. కొనసాగుతున్న జోరు
Kalki 2898 AD Day 7 Box office Collections: కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. వీక్‍డేస్‍లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో మరో మైల్‍స్టోన్‍ను ఈ చిత్రం దాటింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్‍స్టాపబుల్‍గా దూసుకెళుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ వీకెండ్‍లో భారీ కలెక్షన్లను సాధించించగా.. వీక్‍డేస్‍లోనూ అదరగొడుతోంది. కలెక్షన్ల జోరు బలంగా కొనసాగిస్తోంది. జూన్ 27న కల్కి చిత్రం రిలీజ్ కాగా.. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో భారీగా వసూళ్లు వస్తున్నాయి. తాజాగా మరో మైలురాయిని కల్కి 2898 ఏడీ సినిమా దాటింది.
రూ.700 కోట్ల క్లబ్‍లో..
కల్కి 2898 ఏడీ సినిమా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. డ్రీమ్ రన్ కొనసాగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కల్కి 2898 ఏడీ మూవీలో గర్భిణిగా ఉన్న దీపికా పదుకొణ్ మంటల మధ్యలో నడుచుకొని వచ్చే పోస్టర్‌తో రూ.700 కోట్ల అనౌన్స్‌మెంట్ పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ముఖ్యమైన సీన్ నుంచి ఈ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక, కల్కి చిత్రం వసూళ్లు జోరు కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూ.1000 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
నార్త్ అమెరికాలో రికార్డు వేట
నార్త్ అమెరికా (అమెరికా, కెనడా)లో కల్కి చిత్రం రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 13 మిలియన్ డాలర్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా 13 మిలియన్ మార్క్ చేరిన చిత్రంగా కల్కి మరో రికార్డు నెలకొల్పింది. చాలా దేశాల్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల తర్వాత హిందీలో ఈ చిత్రానికి అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి. పాన్ ఇండియాలో ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ మూవీ మరోసారి నిరూపించింది.
కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. శోభన, అన్నా బెన్, దిశా పటానీ, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు చేశారు. భారతీయ పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. అద్భుతమైన విజువల్స్, విజన్‍తో ఈ ఫ్యుచరస్టిక్ డిస్టోపియన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
కల్కి 2898 ఏడీ సినిమా భారీ బడ్జెట్‍తో రూపొందింది. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. సీక్వెల్ కల్కి 2 చిత్రాన్ని కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పటికే సీక్వెల్‍కు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత అశ్వినీదత్ ఇటీవలే వెల్లడించారు. డైెరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే సీక్వెల్ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.