Kalki Producer: క‌ల్కి నిర్మాత‌ల‌తో శ్రీకాంత్ కొడుకు పీరియాడిక‌ల్ మూవీ - అనౌన్స్ చేసిన ఏడాది త‌ర్వాత షూటింగ్ షురూ-kalki 2898 ad makers next movie champion regular shoot begins srikanth son roshan meka nag ashwin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Producer: క‌ల్కి నిర్మాత‌ల‌తో శ్రీకాంత్ కొడుకు పీరియాడిక‌ల్ మూవీ - అనౌన్స్ చేసిన ఏడాది త‌ర్వాత షూటింగ్ షురూ

Kalki Producer: క‌ల్కి నిర్మాత‌ల‌తో శ్రీకాంత్ కొడుకు పీరియాడిక‌ల్ మూవీ - అనౌన్స్ చేసిన ఏడాది త‌ర్వాత షూటింగ్ షురూ

Nelki Naresh Kumar HT Telugu
Aug 18, 2024 08:23 AM IST

Kalki Producer: క‌ల్కి 2898 ఏడీ లాంటి భారీ బ‌డ్జెట్ మూవీ త‌ర్వాత ఓ చిన్న సినిమాను ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు నిర్మాత అశ్వ‌నీద‌త్‌. ఛాంపియ‌న్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. శ‌నివారం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

ఛాంపియ‌న్ మూవీ
ఛాంపియ‌న్ మూవీ

Srikanth Son Roshan: క‌ల్కి నిర్మాత‌ల‌తో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోష‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌నివారం నుంచి మొద‌లైంది. ఛాంపియ‌న్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో క‌లిసి స్వ‌ప్న సినిమా ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మిస్తోంది.

నాగ్ అశ్విన్ క్లాప్‌...

ఛాంపియ‌న్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో పాటు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను శ‌నివారం నుంచి మొద‌లుపెట్టారు. ఈ సినిమా ఫ‌స్ట్ షాట్‌కు క‌ల్కి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క్లాప్ నిచ్చాడు. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో రోష‌న్ మేక పాత్ర స‌రికొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు.ఈ సినిమా కోసం యాక్టింగ్‌, లుక్ ప‌రంగా రోష‌న్ కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యాడ‌ని చెబుతోన్నారు.

గ‌త ఏడాది అనౌన్స్‌మెంట్‌...

కాగా గ‌త ఏడాది ఛాంపియ‌న్‌ మూవీని ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. రోష‌న్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అనౌన్స్ చేసిన ఏడాది త‌ర్వాత ఈ మూవీ సెట్స్‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ ప‌నుల‌తో నిర్మాత‌లు ప్రియాంక‌ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ బిజీగా ఉండ‌టంతో ఛాంపియ‌న్ మూవీ షూటింగ్ ఆల‌స్యంగా మొద‌లైన‌ట్లు స‌మాచారం.

తోట త‌ర‌ణి...

కాగా ఈ చిన్న సినిమాకు అగ్ర సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. మ‌ధి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌గా...ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా తోట త‌ర‌ణి ప‌నిచేస్తోన్నాడు. కాగా అనౌన్స్‌మెంట్ స‌మ‌యంలో సుధాక‌ర్ యెక్కంటిని కెమెరామెన్‌గా ప్ర‌క‌టించారు. తాజాగా అత‌డి స్థానంలో మ‌ది వ‌చ్చాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మిక్కీ జే మేయ‌ర్ పేరు అనౌన్స్‌చేశారు. లేటెస్ట్ పోస్ట‌ర్స్‌లో అత‌డు కూడా ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు.

పెళ్లి సంద‌డితో ఫ‌స్ట్ హిట్‌...

గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి సినిమాతో బాల‌న‌టుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రోష‌న్. అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్‌లో రూపొందిన నిర్మ‌ల కాన్వెంట్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పెళ్లి సంద‌డి సినిమాలోనూ హీరోగా న‌టించాడు. పెళ్లి సంద‌డి సినిమా నెగెటివ్ టాక్‌ను తెచ్చుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ప‌ర్వాలేద‌నిపించింది.

మోహ‌న్‌లాల్ కొడుకుగా...

ప్ర‌స్తుతం ఛాంపియ‌న్‌తో పాటు మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ‌లో రోష‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఎపిక్ మూవీలో మోహ‌న్‌లాల్ కొడుకుగా రోష‌న్ క‌నిపించ‌బోతున్నాడు. మ‌రోవైపు అద్వైతం షార్ట్‌ఫిల్మ్‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ నేష‌న‌ల్ అవార్డును అందుకున్నాడు. ఛాంపియ‌న్ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా ప్ర‌దీప్ అద్వైతం ప‌నిచేశాడు.