Kalki 2898 AD: ప్రేక్షకులు ఆ విషయంలో అవాక్కవడం ఖాయమట!
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చాలా సర్‌ప్రైజ్‍లు ఉంటాయనే రూమర్లు ఉన్నాయి. అయితే, ఓ విషయం మాత్రం ప్రేక్షకులను అత్యంత ఆశ్చర్యపరుస్తుందని టాక్ బయటికి వచ్చింది.
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ సమీపిస్తోంది. వచ్చే వారం జూన్ 27వ తేదీనే ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మైథాలజీ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారత పురాణాలన్నింటికీ ముగింపుగా ఊహించి ఈ కథను రాసుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పడంతో స్టోరీపై ఆసక్తి మరింత పెరిగింది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ట్రైలర్‌తోనే తెలిసిపోయింది. అయితే, తాజాగా కల్కి 2898 ఏడీ సెన్సార్ పూర్తవడంతో కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి.
ఎండింగ్‍కు అవాక్కవ్వాల్సిందే!
కల్కి 2898 ఏడీ సినిమాలో ఎండింగ్ చూసి ప్రేక్షకులు కచ్చితంగా అవాక్కవుతారనే టాక్ బయటికి వచ్చింది. ఈ మూవీ ఎండ్ విషయంలో అభిమానుల మైండ్ బ్లాంక్ అయ్యే అంశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై చాలా మంది సోషల్ మీడియాలోనూ పోస్టులు చేస్తున్నారు. అయితే, ఆ ఎండింగ్ ఏంటన్నది మాత్రం బయటికి రాలేదు. చివర్లో భారీ ట్విస్ట్ ఉంటుందని రూమర్లు రావడంతో ఇప్పటికే కొందరు థియరీలు ఆలోచించుకుంటున్నారు.
స్టాండింగ్ ఓవేషన్
సెన్సార్ సభ్యులకు కల్కి 2898 ఏడీ సినిమా స్క్రీనింగ్ జూన్ 18న జరిగింది. సాధారణంగా మూవీ స్క్రీనింగ్‍కు కొందరు సెన్సార్ సభ్యులే హాజరవుతారు. అయితే, ఈ సినిమాకు మాత్రం భారీ సంఖ్యలో సెన్సార్ అధికారులు వచ్చారట. ఈ మూవీ పూర్తయ్యాక అందరూ లేచినిలబడి చప్పట్లు కొట్టారనే సమాచారం బయటికి వచ్చింది. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్, కథకు అందరూ వారెవా అన్నారని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సహా మరికొందరు స్టార్ల క్యామియో రోల్స్ ఉన్నాయని కూడా ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ట్రైలర్లో చూసింది కొంతేనని, సినిమాలో చాలా సర్‌ప్రైజ్‍లు ప్రేక్షకులు చూడబోతున్నారని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో అద్భుతమైన విజువల్స్‌తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్, ఎమోషన్లు కూడా కూడా అద్భుతంగా పండాయనే టాక్ వచ్చింది. భారతీయ మూవీలో ఇది ఎపిక్ అనే కొందరు ట్రేడ్ ఎనలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమా యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. సుమారు 3 గంటలు రన్‍టైమ్ ఉండనుంది.
ముంబైలో ఈవెంట్
కల్కి 2898 ఏడీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్ 19) ముంబైలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభాస్‍తో పాటు మూవీ టీమ్ సభ్యులు ముంబై చేరుకున్నారు. సాయంత్రం ఈ ఈవెంట్ మొదలుకానుంది. రిలీజ్ మరో వారం మాత్రమే ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్లలో మూవీ టీమ్ జోరు పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నిర్వహించనుంది. అయితే, ఇంకా వేదిక ఖరారు కాలేదు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, సస్వస్త ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. అలనాటి హీరోయిన్ శోభన కూడా ఈ సినిమాలో ఉన్నారని మూవీ టీమ్ నేడే వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. సుమారు రూ.600కోట్లతో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
టాపిక్