Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!
Kalki 2898 AD Event Date Time: కల్కి 2899 ఏడీ సినిమా ఈవెంట్‍కు డేట్, టైమ్ ఖరారయ్యాయి. భారీ రేంజ్‍లో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ గురించి మూవీ టీమ్ అధికారింగా వెల్లడించింది.
Kalki 2898 AD Event: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో చాలా హైలైట్‍లు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచమే సృష్టించారని, అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందనే హైప్ ఉంది. కల్కిలోని బుజ్జీ అనే వాహనానికి చెందిన ‘బ్రైన్’ను ఇటీవల మూవీ టీమ్ పరిచయం చేసింది. ఆ వీడియో ఆకట్టుకుంది. ఇక స్పెషల్ వెహికల్ ‘బుజ్జీ’ కోసం ఓ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ డేట్, టైమ్, వేదికను కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
రేపే ఈవెంట్.. టైమ్ ఇదే
కల్కి 2898 ఏడీ ఈవెంట్ వివరాలను వైజయంతీ మూవీస్ వెల్లడించింది. రేపు (మే 22) సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ జరగనుంది. బుజ్జీ x భైరవను కలవండి అంటూ ఈ ఈవెంట్ వివరాలను టీమ్ నేడు (మే 21) ప్రకటించింది. కల్కి టీమ్ నిర్వహిస్తున్న తొలి ఈవెంట్ కావటంతో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది.
భారీగా ఈవెంట్.. కళ్లు చెదిరే సెట్
కల్కి 2898 ఏడీ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ సిద్ధమవుతోంది. కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఈ ఈవెంట్‍కు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఉత్తరాది మీడియా కూడా ఈ మ్యాసివ్ ఈవెంట్‍కు రానుంది. రేపు (మే 22) జరిగే ఈవెంట్‍పై అందరి దృష్టి నెలకొంది. అలాగే, ఈ ఈవెంట్‍లో భారీ అప్‍ట్ రానుందని కూడా టాక్ వినిపిస్తోంది. చాలా హైప్ క్రియేట్ చేసిన ఈ బుజ్జీ స్పెషల్ వెహికల్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్యామియోలపై క్లారిటీ వస్తుందా!
కల్కి 2898 ఏడీ సినిమాలో క్యామియో రోల్ చేశారని చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కనిపిస్తారనే రూమర్లు ఉన్నాయి. అలాగే, దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ మూవీలో క్యామియో రోల్‍లో కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే, రేపు (మే 22) జరగనున్న కల్కి ఈవెంట్‍లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కొందరి పాత్రలపై అయినా మూవీ టీమ్ హింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. పురాణాల ఆధారంగా ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించిందని అంచనా.
టాపిక్