Kalki 2898 AD day 19 Box office: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకుంది. డొమెస్టిక్ బాక్సాఫీస్ దగ్గర రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ రికార్డు బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ జవాన్ రికార్డుపై కన్నేసింది.
కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు డొమెస్టిక్ కలెక్షన్లలో యానిమల్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటికే మూడో వారంలోకి ఎంటరైన ఈ సినిమా సోమవారం (జులై 15) 19వ రోజు ఇండియాలో రూ.4.3 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే రిలీజైన ఇండియన్ 2 మూవీ నాలుగో రోజు కేవలం రూ.3.15 కోట్లు వసూలు చేయగా.. కల్కి మాత్రం 19వ రోజు కూడా అంతకంటే ఎక్కువే రాబట్టింది.
దీంతో ఇండియాలో కల్కి 2898 ఏడీ నెట్ కలెక్షన్లు రూ.584.45 కోట్లకు చేరాయి. ఇప్పటికే యానిమల్ మూవీ దేశవాళీ కలెక్షన్లు రూ.553.87 కోట్ల రికార్డును కల్కి బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ (రూ.640.25 కోట్లు) రికార్డుపై కన్నేసింది. దానికి మరో రూ.56 కోట్ల దూరంలో నిలిచింది. కొత్తగా రిలీజైన ఇండియన్ 2, సర్ఫిరాలాంటి సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడం కూడా కల్కి 2898 ఏడీకి కలిసి వస్తోంది.
ఇప్పటికీ దేశవాళీ కలెక్షన్లలో బాహుబలి 2 ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇండియాలోనే రూ.1030.42 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కల్కి విషయానికి వస్తే సోమవారం 19వ రోజు హిందీ వెర్షన్ రూ.2.5 కోట్లు వసూలు చేయగా.. తెలుగులో రూ.1.35 కోట్లు రాబట్టింది.
కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన ఏడో ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. గతంలో దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్, జవాన్ సినిమాలు ఈ మార్క్ అందుకున్నాయి. మూడో వారంలోనూ కల్కి 2898 ఏడీ జోరు చూస్తుంటే షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ రికార్డులు బ్రేకవడం ఖాయం కనిపిస్తోంది.
తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వస్తోంది. నిజానికి గత ఆదివారం (జులై 14) ఈ సినిమా రూ.16 కోట్లు వసూలు చేయడం విశేషం. ఆ లెక్కన వీకెండ్స్, హాలిడేస్ లో ఇప్పటికీ కల్కి 2898 ఏడీ తన జోరు కొనసాగించేలా కనిపిస్తోంది. పఠాన్ మూవీ రూ.1050 కోట్లు, జవాన్ రూ.1150 కోట్లు వసూలు చేశాయి. ఆ లెక్కన జవాన్ దేశవాళీ రికార్డే కాదు.. ఓవరాల్ రికార్డును కూడా కల్కి అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
టాపిక్