Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!-kalki 2898 ad closing collection prabhas movie seventh place in highest grossing indian movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!

Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!

Nelki Naresh Kumar HT Telugu
Aug 23, 2024 10:43 AM IST

Kalki Closing Collections: తెలుగులో రాజ‌మౌళి సినిమాల త‌ర్వాత వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా క‌ల్కి 2898 ఏడీ మూవీ నిలిచింది. క‌ల్కి మూవీ థియేట‌ర్ల‌లో 1054 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నైజాంతో పాటు మిగిలిన ఏరియాల్లో ఈ మూవీ సాధించిన క‌లెక్ష‌న్స్ ఇవే...

కల్కి ఫైనల్ కలెక్షన్స్
కల్కి ఫైనల్ కలెక్షన్స్

Kalki Closing Collections: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఏడో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఏకంగా 1054 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2024 ఏడాదిలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన ఇండియ‌న్ మూవీగా నిలిచింది.

టాలీవుడ్ రికార్డులు...

ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి 2898 ఏడీ మూవీ 300 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, 182 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో 77 కోట్లు, త‌మిళ‌నాడులో 45 కోట్లు, కేర‌ళ‌లో 33 కోట్ల వ‌ర‌కు క‌ల్కి మూవీ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. ఓవ‌ర్‌సీస్‌లో క‌ల్కి మూవీ గ‌త టాలీవుడ్ మూవీ రికార్డులు మొత్తం చెరిపివేసింది. 260 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను 120 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

27 కోట్ల లాభం...

నైజాం ఏరియాలో క‌ల్కి 2898 ఏడీ థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు 65 కోట్ల‌కు అమ్ముడుపోగా... యాభై రోజుల్లో ఈ సినిమాకు 92 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఒక్క నైజాం ఏరియాలోనే ప్ర‌భాస్ మూవీకి 27 కోట్ల‌కుపైగా లాభాలు వ‌చ్చాయి.

హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌...

ఇండియ‌న్ సినిమాల్లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్‌లో దంగ‌ల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. 1970 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత ప్లేస్‌లో రాజ‌మౌళి బాహుబ‌లి 2 (1800 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1271 కోట్లు) క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్నాయి. కేజీఎఫ్ 2 (1230 కోట్లు), షారుఖ్‌ఖాన్ జ‌వాన్ (1160 కోట్లు), ప‌ఠాన్ (1060 కోట్లు) త‌ర్వాత ప్లేస్‌లో క‌ల్కి 2898 ఏడీ నిలిచింది. రాజ‌మౌళి సినిమాల త‌ర్వాత తెలుగులో వెయ్యి కోట్ల ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ మూవీగా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్‌...నెట్‌ఫ్లిక్స్‌...

క‌ల్కి మూవీ గురువారం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో క‌ల్కి విడుద‌ల కాగా...నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్ష‌న్ స్ట్రీమింగ్ అవుతోంది.

మూడు ప్ర‌పంచాల క‌థ‌...

కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే మూడు ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్స్ నేప‌థ్యంలో సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌...

క‌ల్కి మూవీలో దీపికా ప‌దుకోణ్, అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టించాడు. ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ న‌టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌, రామ్ గోపాల్ వ‌ర్మ‌, రాజ‌మౌళి తో పాటు ప‌లువురు యాక్ట‌ర్లు, డైరెక్ట‌ర్లు గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించారు.

క‌ల్కి 2898 ఏడీ క‌థ ఇదే...

కాశీ న‌గ‌రం పైన కాంప్లెక్స్ అనే ప్ర‌పంచం ఉంటుంది. దానికి సుప్రీమ్ యాశ్కిన్ అధిప‌తి. కాంప్లెక్స్‌లోకి వెళ్లాల‌ని భైర‌వ ప్ర‌య‌త్నిస్తుంటాడు. కాంప్లెన్స్ నుంచి త‌ప్పించుకున్న సుమ‌తి ఎవ‌రు? ఆమెను అశ్వ‌త్థామ ఎందుకు కాపాడాడు? కాంప్లెక్స్ మ‌నుషుల‌కు సుమ‌తిని అప్ప‌గించాల‌ని భైర‌వ ఎందుకు అనుకున్నాడ‌నే పాయింట్‌తో క‌ల్కి మూవీని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు.

సీక్వెల్‌....

క‌ల్కి మూవీలో భైర‌వ‌గా, క‌ర్ణుడిగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ క‌నిపించాడు. క‌ల్కి మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. సెకండ్ పార్ట్‌లో క‌ర్ణుడి పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ల్కి సీక్వెల్‌కు సంబంధించి ఇప్ప‌టికే 30 శాతం వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.