Kalki 2898 AD Box office: కల్కి 2898 ఏడీ మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే..-kalki 2898 ad box office prabhas nag ashwin deepika padukone amitabh bachchan movie grosses 1100 crores worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Box Office: కల్కి 2898 ఏడీ మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే..

Kalki 2898 AD Box office: కల్కి 2898 ఏడీ మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే..

Hari Prasad S HT Telugu
Published Jul 25, 2024 02:55 PM IST

Kalki 2898 AD Box office: కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ సినిమాగా నిలవగా.. ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.

కల్కి 2898 ఏడీ మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే..
కల్కి 2898 ఏడీ మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే..

Kalki 2898 AD Box office: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఐదో వారంలోకి ఎంటరైనా బాక్సాఫీస్ రికార్డుల పరంపరకు ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ సినిమా తాజాగా మరో మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు వైజయంతీ మూవీస్ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇలా రెండుసార్లు రూ.1100 కోట్ల మార్క్ అందుకున్న తొలి హీరో ప్రభాస్ మాత్రమే.

కల్కి 2898 ఏడీ రికార్డు

ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. జూన్ 27న రిలీజైన ఈ సినిమా ఐదో వారంలోకి ఎంటరైంది. అయితే తాజాగా 28వ రోజు కూడా ఈ సినిమా ఇండియాలో రూ.1.7 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ 28 రోజుల్లో తమ సినిమా రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు వైజయంతీ మూవీస్ వెల్లడించింది.

"1100 కోట్లు ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఐదో వారంలోనూ కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది" అంటూ సదరు నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. క్లైమ్యాక్స్ సీన్లో దీపికాను ప్రభాస్ ఎత్తుకెళ్తున్న ఫొటో అందులో చూడొచ్చు. జులై 13న రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న కల్కి మూవీ.. తర్వాత పది రోజుల్లో మరో రూ.100 కోట్లు వసూలు చేసింది.

ఏకైక హీరో ప్రభాస్

ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ మూవీ రూ.1100 కోట్లు వసూలు చేసిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే ఇలా రెండుసార్లు రూ.1100 కోట్ల మార్క్ దాటిన తొలి హీరో మాత్రం ప్రభాసే. గతంలో అతడు నటించిన బాహుబలి 2 కూడా ఈ మార్క్ అందుకోవడమే కాదు.. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక గతేడాది మొదట్లో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ రూ.1050 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడు ప్రభాస్ మూవీ దానిని అధిగమించి రూ.1100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంతకు ముందు దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాలు ఈ రూ.1100 కోట్ల మార్క్ అందుకున్నాయి.

నాలుగు వారాలైనా కూడా అటు హిందీలో, ఇటు తెలుగులో కల్కి 2898 ఏడీ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చే మూవీ ఈ నాలుగు వారాల్లో ఒక్కటి కూడా తగల్లేదు. అది కూడా ప్రభాస్ సినిమాకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. రూ.1000 కోట్ల మార్క్ దాటిన ఇండియన్ సినిమాలు ఏడు ఉండగా.. అందులో ప్రభాస్, షారుక్ సినిమాలు రెండేసి ఉన్నాయి.

Whats_app_banner