Prabhas Disha Patani: ప్రభాస్‌ ఇంటి ఫుడ్‌పై కల్కి హీరోయిన్ కామెంట్స్.. తొలి రోజు షూటింగ్ గుర్తు చేసుకున్న దిశా పటానీ-kalki 2898 ad actress disha patani recalls prabhas and home food when first day shooting of kalki ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Disha Patani: ప్రభాస్‌ ఇంటి ఫుడ్‌పై కల్కి హీరోయిన్ కామెంట్స్.. తొలి రోజు షూటింగ్ గుర్తు చేసుకున్న దిశా పటానీ

Prabhas Disha Patani: ప్రభాస్‌ ఇంటి ఫుడ్‌పై కల్కి హీరోయిన్ కామెంట్స్.. తొలి రోజు షూటింగ్ గుర్తు చేసుకున్న దిశా పటానీ

Sanjiv Kumar HT Telugu
Published Jun 11, 2024 12:25 PM IST

Disha Patani About Prabhas Home Food: కల్కి 2898 ఏడీ మూవీ మొదటి రోజు షూటింగ్‌ను హీరోయిన్ దిశా పటానీ గుర్తు చేసుకుంది. గతంలో ప్రభాస్‌పై దిశా పటానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌పై, ప్రభాస్ ఇంటి ఆహారంపై దిశా పటానీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభాస్‌ ఇంటి ఫుడ్‌పై కల్కి హీరోయిన్ కామెంట్స్.. తొలి రోజు షూటింగ్ గుర్తు చేసుకున్న దిశా పటానీ
ప్రభాస్‌ ఇంటి ఫుడ్‌పై కల్కి హీరోయిన్ కామెంట్స్.. తొలి రోజు షూటింగ్ గుర్తు చేసుకున్న దిశా పటానీ

Kalki 2898 AD Disha Patani Prabhas: బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. సినిమాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో, బికినీ, షార్ట్ డ్రెస్సులో హాట్ అండ్ సిజ్లింగ్ ఫొటోలతో నెటిజన్స్, ఆడియెన్స్‌ను కవ్విస్తుంటుంది. సూపర్ బోల్డ్ పిక్స్ పెట్టి యూత్‌ హాట్ బీట్‌ను పెంచేస్తుంటుంది.

తెలుగులో లోఫర్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎమ్ఎస్ ధోనీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న దిశా పటానీ ఆ తర్వాత బాఘీ 2, మలంగ్, ఏక్ విలన్ 2 సినిమాలతో అట్రాక్ట్ చేసింది. సినిమాల్లో గ్లామర్ అండ్ హాట్ షోతో అదరగొట్టే దిశా పటానీ ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీ ఖన్నా యాక్షన్ ఫిల్మ్ యోధలో అదిరిపోయే ఫైట్ సీన్స్ చేసి అట్రాక్ట్ చేసింది.

త్వరలో యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది దిశా పటానీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన జోడీ కట్టింది దిశా పటానీ. ఇక సోమవారం విడుదలైన కల్కి 2898 ఏడీ ట్రైలర్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించింది దిశా పటానీ. ప్రభాస్‌తో చిన్నిపాటి ఫైట్ సీన్‌తో తళుక్కుమంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే, గతంలో ఈ సినిమా ప్రారంభంలో షూటింగ్ సమయంలో ప్రభాస్‌పై దిశా పటానీ కామెంట్స్ చేసింది. ట్రైలర్ విడుదల తర్వాత వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో మరోసారి దిశా పటానీ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కల్కి 2898 ఏడీ సెట్స్‌లో తన మొదటి రోజును గుర్తుచేసుకుంది దిశా పటానీ.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి పొగుడుతూ మాట్లాడింది బోల్డ్ బ్యూటి దిశా పటానీ. "ప్రభాస్ ఒక స్వీట్ పర్సన్. ఆయనతో సినిమాలు చేయడం చాలా సులభంగా, కంపర్ట్‌ఫుల్‌గా ఉంటుంది" అని పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిశా పటానీ తెలిపింది. అలాగే షూటింగ్ మొదటి రోజున ప్రభాస్ తనకోసం మాత్రమే కాకుండా మూవీ టీమ్ మొత్తానికి ఇంటి ఫుడ్ తీసుకొచ్చాడని వెల్లడించింది దిశా పటానీ.

దిశా పటానీ ఇంకా మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటీనటులలో ప్రభాస్ ఒకరు. అతను చాలా వినయపూర్వకంగా, మర్యాదగా ఉంటాడు" అని దిశా పటానీ పేర్కొంది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో, మీడియా వర్గాల్లో వైరల్ అవుతూ హాట్ టాపిక్ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం భారతదేశం యావత్ మొత్తం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాలలో ముందు వరుసలో ఉన్నది కల్కి 2898 ఏడీ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌కి నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రధానంగా తెలుగులో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హిందీలో రీషూట్ చేశారు.

క్రీ.శ. 2898లో జరిగిన అపోకలిప్టిక్ అనంతర ప్రపంచంలో ఈ సినిమా కథ నడుస్తుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌గా అనుకుంటున్న ఈ ఫ్రాంఛైజీలో మొదటి విడతగా ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అండ్ దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న బిగ్ స్క్రీన్‌లపైకి రానుంది.

Whats_app_banner