Kalki 2898 AD Box Office: 50 శాతం పడిపోయిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్- 4వ సినిమాగా రికార్డ్! పెరిగిన లాభాలు
Kalki 2898 AD 37 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మూడో సినిమా కల్కి 2898 ఏడీ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. అయితే, 37వ రోజున కల్కి సినిమా వసూళ్లు భారీగానే తగ్గాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ కొన్ని రికార్డులను మాత్రం తన ఖాతాలో వేసుకుంది.
Kalki 2898 AD Box Office Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తోనే కొనసాగుతోంది.
అయితే, మొన్నటివరకు హెచ్చు తగ్గులతో రోజుకు దాదాపుగా కోటి రూపాయల కలెక్షన్స్‌తో దూసుకుపోయిన కల్కి సినిమా 37వ రోజు వచ్చేసరికి భారీగా వెనక్కి తగ్గింది. 6వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కల్కి సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోయాయి. 6వ వారంలో మంచి హోల్డ్‌తో ప్రారంభమైనప్పటికీ ఎండింగ్‌లో మాత్రం నిరాశపరిచింది.
కల్కి 2898 ఏడీ సినిమా ఆరో శుక్రవారం (ఆగస్ట్ 2) అంటే 37వ రోజున ఇండియాలో సుమారుగా రూ. 65 లక్షల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే ఇది 36వ రోజుతో పోలిస్తే 50 శాతం వరకు కలెక్షన్స్ తగ్గాయి. అయితే, కల్కి సినిమా టికెట్స్‌ను కేవలం వంద రూపాయలకే ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం లక్షల వరకే పరిమితం అయ్యాయి.
ఆగస్ట్ 2 నుంచి రూ. 100కు టికెట్ రేట్స్ ప్రకటించినా కల్కి కలెక్షన్స్ పెద్దగా రాబట్టలేకపోయింది. ఇక కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో 37 రోజుల్లో రూ. 636.50 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అలాగే రూ. 756 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలోని అన్ని భాషల వెర్షన్స్ కలిపి ఈ కలెక్షన్స్ వచ్చాయి.
అయితే, ఇలాగే కలెక్షన్స్ కొనసాగితే.. కల్కి మూవీ రూ. 650 కోట్ల నికర వసూళ్లను సాధించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కానీ, కల్కి సినిమా రాబోయే రోజుల్లో షారుక్ ఖాన్ నటించిన జవాన్ లాంగ్ రన్‍లో సాధించిన రూ. 640 నెట్ కలెక్షన్స్, రూ. 760 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను బ్రేక్ చేసేలా మాత్రం ఉంది. ఇదే గనుక జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నాలుగో బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రూ. 274 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ సాధించింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 1048.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన 7వ భారతీయ చిత్రంగా కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇక కల్కి 2899 ఏడీ మూవీ వల్ల నిర్మాతలకు ఇప్పటివరకు రూ. 161.77 కోట్ల లాభాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే, ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తోపాటు పలువురు పాపులర్ డైరెక్టర్స్ కెమియోస్ చేసిన విషయం తెలిసిందే.