Kalki 2898 AD Box Office: నిలకడగా కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. 5 వారాల్లో 1045 కోట్లు.. మరి లాభాలు ఎంతంటే?
Kalki 2898 AD 35 Days Worldwide Collection: ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ వసూళ్లతో బాగా రాణిస్తున్న కల్కి సినిమా 5 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
Kalki 2898 AD 5 Weeks Box Office Collection: భైరవగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898 ఏడీ. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
సుమారు కోటి కలెక్షన్స్
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతూనే ఉంది. తాజాగా బుధవారంతో ఐదో వారం కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికీ సుమారు కోటి రూపాయల కలెక్షన్లతో కల్కి సినిమా సత్తా చాటుతోంది. అయితే, 35వ రోజున కల్కి మూవీ ఇండియాలో రూ. 95 లక్షల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే సుమారుగా కోటికి దగ్గరగా వసూలు చేసింది.
5 వారాల కలెక్షన్స్
34వ రోజున వచ్చిన కలెక్షన్స్ లాగే 35వ రోజున 95 లక్షలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ అన్ని వెర్షన్స్ కలిపి ఇండియాలో ఒక్క రోజు 95 లక్షలు మాత్రమే రాబట్టింది కల్కి 2898 ఏడీ మూవీ. ఇక మొత్తంగా 35 రోజుల్లో అంటే 5 వారాల్లో కల్కి చిత్రానికి భారతదేశంలో రూ. 634.95 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
36వ రోజున 2 లక్షలే
ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమాకు రూ. 1045.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇదిలా ఉంటే, 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన కల్కి సినిమా 35వ రోజుతో రూ. 160.46 కోట్ల లాభాలు రాబట్టింది. దాంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా, 36వ రోజున ప్రస్తుతం అయిన బుకింగ్స్ ప్రకారం ఇండియాలో కల్కికి రూ. 2 లక్షలు మాత్రమే కలెక్ట్ కానున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
రెండు ఓటీటీల్లో కల్కి
ఇదిలా ఉంటే, ఇప్పటికే థియేటర్లలో కల్కి 2898 ఏడీ సినిమాను చూసినప్పటికీ కల్కి ఓటీటీ రిలీజ్ కోసం ఎంతోమంది ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీ రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఓటీటీతోపాటు నెట్‌ఫ్లిక్స్ కూడా కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని టాక్.
నెట్‌ఫ్లిక్స్‌కు హిందీ వెర్షన్
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కల్కి 2898 ఏడీ సినిమాను దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ చేయగా.. కల్కి హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్‌కు నార్త్‌లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని కల్కి 2898 ఏడీ హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకోసం నిర్మాతలకు భారీగానే ముట్టజెప్పిందని టాక్.
టాపిక్