Kalki 2898 AD Box Office: భవిష్యత్‌పై మూవీ తీసి చరిత్ర సృష్టించాడు- కల్కి 2898 ఏడీ 34 డేస్ కలెక్షన్స్
Kalki 2898 AD 34 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరుగులతో సత్తా చాటుతోంది. అయితే 34వ రోజు మాత్రం కలెక్షన్లలో వెనక్కి తగ్గింది. 34 రోజుల్లో వచ్చిన కల్కి కలెక్షన్స్ చూస్తే..
Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ నటీనటులతో క్లాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమానే కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో సైన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన కల్కి మూవీ జూన్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఇంకా రచ్చ చేస్తోంది.
ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్లలో పర్వాలేదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కనీసం కోటి రూపాయల వరకు వసూళ్లు సాధించింది. అయితే, 34వ రోజు మాత్రం కల్కి కలెక్షన్స్ తగ్గాయి. రూ. కోటి కంటే తక్కువ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద వెనకడుగు వేసింది ప్రభాస్ కల్కి మూవీ.
కల్కి సినిమా ఇండియాలో 34వ రోజున రూ. 95 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. అంటే కోటికి రూ. 5 లక్షలు తక్కువగా కలెక్ట్ చేసింది. ఈ 95 లక్షల నెట్ ఇండియా కలెక్షన్లలో తెలుగు నుంచి 39 లక్షలు, తమిళం నుంచి రూ. 3 లక్షలు, హిందీ నుంచి రూ. 5 లక్షలు, కన్నడ నుంచి లక్ష, మలయాళం వెర్షన్ నుంచి రెండు లక్షలు వాటాలు ఉన్నాయి.
ఈ లెక్కన గత రోజు అంటే 33వ రోజుతో పోల్చి చూస్తే 34వ రోజున కల్కి 2898 ఏడీ మూవీ కలెక్షన్స్ 9.52 శాతం తగ్గాయి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇండియా వ్యాప్తంగా కల్కి మూవీకి రూ. 634 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో తెలుగు వెర్షన్‌కు రూ. 282.74 కోట్లు, తమిళం నుంచి 35.83 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 285.7 కోట్లు, కన్నడ వెర్షన్ నుంచి రూ. 5.72 కోట్లు, మలయాళం నుంచి 24.01 కోట్లుగా వసూళ్లు వచ్చాయి.
అయితే, నార్త్ అమెరికాలో కల్కి 2898 ఏడీ సినిమా 18.5 ప్లస్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టినట్లు మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇంకా కౌంటింగ్ కంటిన్యూ అని పేర్కొన్నారు. అలాగే నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా కల్కి నిలిచిందని పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.
"భవిష్యత్ గురించి సినిమా తెరకెక్కించి చరిత్ర సృష్టించాడు. అసాధారణమైన శక్తితో ప్రభాస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కల్కి 2898 ఏడీ నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి ప్రేమ, సపోర్ట్ మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకువచ్చింది" అని పోస్ట్‌లో మేకర్స్ రాసుకొచ్చారు.
ఇక వరల్డ్ వైడ్‌గా కల్కి 2898 ఏడీ సినిమా రూ. 1044.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ఇప్పటివరకు రూ. 159.89 కోట్లు అంటే దాదాపుగా 160 కోట్ల ప్రాఫిట్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది కల్కి చిత్రం.