Kalki 2898 AD Box Office: ఒక్కరోజే మరో కోటి రాబట్టిన కల్కి 2898 ఏడీ- కోట్లల్లో లాభాలు- 33 రోజుల కల్కి కలెక్షన్స్ ఇవే!
Kalki 2898 AD 33 Days Worldwide Collection: ప్రభాస్, దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైన ఐదు వారాలు దాటిన కూడా మంచి కలెక్షన్స్‌తో దూసుకోపోతోంది. ఈ నేపథ్యంలో 33వ రోజున కల్కి కలెక్షన్స్ వసూళ్లు ఎన్నని చూస్తే..
Kalki 2898 AD Box Office Collection: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. జూన్ 27న వరస్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి మూవీ ఐదు వారాలకు చేరుకుంది. అయినప్పటికీ జోరుగా కలెక్షన్స్ రాబడుతోంది.
తెలుగు వెర్షన్‌కు
కల్కి 2898 ఏడీ సినిమా 33వ రోజున అంటే ఐదో సోమవారం రోజున ఇండియాలో రూ. కోటి ఐదు లక్షలు రాబట్టింది. వీటిలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 54 లక్షలు, హిందీ బెల్ట్ నుంచి రూ. 45 లక్షలు, తమిళం నుంచి రూ. 3 లక్షలు, కర్ణాటక నుంచి రూ. లక్ష, మలయాళం నుంచి రూ. 2 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే, 33వ రోజున తెలుగు వెర్షన్‌కు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.
కలెక్షన్స్ తగ్గేదేలే..
అయితే, గత వారం రోజుల కలెక్షన్స్ చూస్తే మాత్రం 33వ రోజున ఇండియాలో కలెక్షన్స్ తగ్గినట్లు చెప్పుకోవాలి. అలా 73.75 శాతం కలెక్షన్స్ తగ్గాయి. 32వ రోజున నాలుగు కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ అంతకుముందు రోజున రూ. 2.9 కోట్లు రాబట్టింది. ఏమైనా గానీ 33వ రోజున కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్లలో తగ్గేదేలే అంటోంది ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ.
హిందీ నుంచే ఎక్కువగా
ఇక మొత్తం 33 రోజుల్లో ఇండియాలో కల్కి 2898 ఏడీ సినిమాకు రూ. 633.05 కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 282.35 కోట్లు వస్తే హిందీ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ. 285.2 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం. అలాగే కర్ణాటక నుంచి రూ. 5.71 కోట్లు, తమిళం నుంచి రూ. 35.8 కోట్లు, మలయాళ వెర్షన్‌కు రూ. 23.99 కోట్లు వసూలు అయ్యాయి. 33 రోజుల్లో ఇండియా వైడ్‌గా చూస్తే హిందీ నుంచే ఎక్కువగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
150 కోట్లకుపైగా ప్రాఫిట్
అయితే, కల్కి గ్రాస్ డొమెస్టిక్ కలెక్షన్స్ మాత్రం రూ. 754.14 కోట్లు అని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాకు రూ. 1042.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన కల్కి 2898 ఏడీ సినిమా అది పూర్తి చేసి ఇప్పటికీ రూ. 159.27 కోట్ల లాభాలు అర్జించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
34వ రోజున 15 లక్షలు
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అయిన బుకింగ్స్, పలు రిపోర్ట్స్ ప్రకారం కల్కి 2898 ఏడీ సినిమాకు మంగళవారం అంటే 34వ రోజున రూ. 15 లక్షల వసూళ్లు రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఈ కలెక్షన్స్ నైట్ షోస్ పూర్తయ్యే సరికి పెరిగే అవకాశం ఉంది.
టాపిక్