ఓటీటీలోకి ఇవాళ ఎన్నో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, తెలుగు, తమిళం భాషల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు రావడం చాలా అరుదు. కానీ, 2025లో రీసెంట్‌గా ఓ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. అదే కలియుగం 2064.
మూడో ప్రపంచ యుద్దం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకచోట సేఫ్ హౌజ్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌజ్ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు.
అయితే, ఓ రోజు ఆ సేఫ్ హౌజ్‌లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శక్తి, భూమి మధ్య నెలకొన్న పరిస్థితులు ఏంటీ? చివరికి ఏమైంది? అనే అంశాలతో కలియుగం 2064 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ సుందర్ కథ, దర్శకత్వం వహించారు.
తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకే కాలంలో తెరకెక్కిన కలియుగం 2064 సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఇనియన్ సుబ్రమణి, ఆర్య లక్ష్మీ ఇతర కీలక రోల్స్‌లో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇదివరకు తెలుగులో జెర్సీ, డాకు మహరాజ్, మెకానిక్ రాకీ వంటి పలు సినిమాల్లో అలరించింది.
సింప్లీ సౌత్ ఓటీటీలో కలియుగం 2064 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సింప్లీ సౌత్‌లో నేటి నుంచి కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.
దీంతోపాటు ఇవాళ ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 8 రేటింగ్ ఉంది. అయితే, సన్ నెక్ట్స్‌లో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది.
సంబంధిత కథనం
టాపిక్