No Benefit Shows: పోకిరి ఎఫెక్ట్‌.. ఇక నుంచి నో బెనిఫిట్‌ షోస్‌-kakinada exhibitors decided to not to show benefit shows here after ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  No Benefit Shows: పోకిరి ఎఫెక్ట్‌.. ఇక నుంచి నో బెనిఫిట్‌ షోస్‌

No Benefit Shows: పోకిరి ఎఫెక్ట్‌.. ఇక నుంచి నో బెనిఫిట్‌ షోస్‌

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 04:42 PM IST

No Benefit Shows: పోకిరి రీరిలీజ్‌ ఎఫెక్ట్‌ మామూలుగా లేదు. అప్పుడు ఫ్యాన్స్‌ చేసిన హంగామాతో ఇక నుంచి ఫ్యాన్స్‌ షోలు, బెనిఫిట్‌ షోలు వేయకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం విశేషం.

<p>పోకిరి మూవీలో మహేష్ బాబు</p>
పోకిరి మూవీలో మహేష్ బాబు (twitter)

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన మూవీ పోకిరి. ఈ సినిమా ఈ మధ్య మహేష్‌ బాబు 47వ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్‌ షోలు వేశారు. దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు. 16 ఏళ్ల కిందట ఈ మూవీ చూస్తూ ఎలా ఊగిపోయారో అంతకు రెట్టింపు సందడి థియేటర్లలో చేశారు. అయితే ఫ్యాన్స్‌ అత్యుత్సాహం కొందరి థియేటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

దీంతో కాకినాడలోని ఎగ్జిబిటర్ల సంఘం ఇక నుంచి ఫ్యాన్స్‌ షోలు, బెనిఫిట్‌ షోలు వేయకూడదని నిర్ణయించాయి. చాలా థియేటర్లలో సీట్లు చించేశారు. విరగొట్టారు. కొన్ని స్క్రీన్లు ధ్వంసం చేశారు. ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించారు. కాకినాడలోని ఆనంద్‌ థియేటర్‌కు ఇలా భారీ నష్టం వాటిల్లింది. దీంతో కాకినాడ టౌన్‌ సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ఈస్ట్‌ గోదావరి సినీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌కు ఓ లేఖ రాసింది.

ఇక నుంచి తాము ఫ్యాన్స్‌, బెనిఫిట్‌ షోలు వేయబోమని స్పష్టం చేసింది. తామంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అందులో అసోసియేషన్‌ చెప్పింది. ఆగస్ట్‌ 11 నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా కూడా విధించనున్నారు. దీంతో కాకినాడలో ఇక నుంచి అందరు హీరోల ఫ్యాన్స్‌, బెనిఫిట్‌, స్పెషల్‌ షోలు బంద్‌ కానున్నాయి.

ఈస్ట్‌ గోదావరి జిల్లా మొత్తం ఎగ్జిబిటర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకోగా.. అటు ఇతర జిల్లాల వాళ్లు కూడా ఇదే పని చేయనున్నట్లు సమాచారం. పోకిరి స్పెషల్‌ షోల సందర్బంగా ఇతర చోట్ల కూడా బాగానే నష్టం జరిగింది.

Whats_app_banner