లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొన్నాళ్లుగా తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. శుక్రవారం ఒకే రోజు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఏకంగా ఏడు టాలీవుడ్ మూవీస్ రిలీజయ్యాయి. అన్నీ థ్రిల్లర్ సినిమాలే కావడం. ఆ సినిమాలు ఏవంటే?
కాజల్ హీరోయిన్‌గా నటించిన సత్యభామ మూవీ ఇప్పటికే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోనవీన్ చంద్ర, ప్రజ్వల్ యాద్మా కీలక పాత్రలు పోషించారు.
సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. హసీనా అనే గృహిణి హత్యకు గురువుతుంది. ఆ హత్య కేసు మిస్టరీని సత్యభామ ఎలా ఛేదించింది అన్నదే ఈ మూవీ కథ.
హన్సిక హీరోయిన్‌గా నటించిన మై నేమ్ ఈజ్ శృతితో పాటు 105 మినట్స్ సినిమాలు లయన్స్ గేట్ ప్లేలో శుక్రవారం రిలీజయ్యాయి. 105 మినట్స్ మూవీ సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. ఓ ఇంట్లో బంధీగా మారిన యువతి అక్కడి నుంచి ఎలా తప్పించుకుంది అనే కాన్సెప్ట్‌తో 105 మినట్స్ మూవీ రూపొందింది.
మై నేమ్ ఈజ్ శృతి మూవీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందడం గమనార్హం. ఈ మూవీలో శృతి అనే అమ్మాయిగా హన్సిక నటించింది. శృతి ఇంట్లో అను అనే అమ్మాయి డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆమెకు ఎవరు చంపారు? ఈ కేసు నుంచి శృతి ఎలా బయటపడిందనే థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీ రూపొందింది.
రెజీనా హీరోయిన్‌గా నటించిన పీరియాడికల్ హారర్ థ్రిల్లర్ మూవీ నేనే నా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీలో దివ్య అనే ఆర్కియాలజిస్ట్‌గా, దమయంతి అనే యువరాణిగా డ్యూయల్ రోల్‌లో రెజీనా నటించింది. గత జన్మలో తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంది నేనే నా సినిమా కథ.
వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్‌గా నటించిన శబరి మూవీ శుక్రవారం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో విడుదలైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఈ సినిమాలతో పాటు వరుణ్ సందేశ్ విరాజి, అథర్వ సినిమాలు కూడా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో రిలీజయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్